రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా?

సభకు వచ్చి పెద్దరికం నిలుపుకోవాలని కూడా సలహా ఇచ్చాడు. మరి రేవంత్ రెడ్డి కోరికను కేసీఆర్ తీరుస్తాడా ?

మనుషులందరికీ యేవో కోరికలు ఉంటాయి. కోరికలు లేనివారు ఉండరు కదా. రాజకీయ నాయకులకు రాజకీయపరమైన కోరికలు ఉంటాయి. చట్ట సభలకు పోవాలని, పదవులు సంపాదించాలని ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై మాటల దాడి చేయాలని ఉంటుంది.

వారిని ప్రజల్లో బద్నాం చేయాలని ఉంటుంది. విమర్శలు, ఆరోపణలు గుప్పించాలని ఉంటుంది. ఇలాంటి కోరిక ప్రతిపక్ష నాయకులకు, అధికారంలో ఉన్నవారికీ ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ ఉంది. ఆయన కూడా కేసీఆర్ మాదిరిగా మాటలతో, విమర్శలతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.

అతను మంచి ఆరేటరా కాదా అని ఎవరికివారు నిర్ణయించుకోవాల్సిందే. కేసీఆర్ కు బూతులు మాట్లాడతాడనే పేరుంది. కేసీఆర్ అంత కాకపోయినా రేవంత్ రెడ్డి కూడా బూతులు మాట్లాడతాడని అంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పై ప్రత్యక్షంగా ఆరోపణలు, విమర్శలు చేసే అవకాశం రేవంత్ రెడ్డికి రాలేదు. అంటే ముఖాముఖి విమర్శలు, ఆరోపణలు చేసుకోవడమన్న మాట.

ఆ కోరిక రేవంత్ రెడ్డికి మిగిలిపోయింది. వాళ్లిద్దరూ ఎదురుపడే సందర్భం ఎప్పుడూ రాలేదు. కేటీఆర్ ను , హరీష్ రావును, ఇతర గులాబీ పార్టీ నాయకులను విమర్శిస్తున్నా రేవంత్ రెడ్డికి తృప్తిగా లేదు. కేసీఆర్ ను ముఖాముఖీ ఎదుర్కునే వేదిక కేవలం అసెంబ్లీ మాత్రమే. బడ్జెట్ సమావేశాల్లో ఒక్కసారి మాత్రమే కేసీఆర్ అటెండ్ అయ్యాడు.

కాంగ్రెస్ ఏర్పడిన తరువాత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పూర్తిగా మౌనంగా ఉన్నాడు కేసీఆర్. గులాబీ పార్టీలో రేవంత్ కు ప్రధాన శత్రువు కేసీఆర్ మాత్రమే. అందుకే ఆయనతో ఢీకొనాలని ఆత్రపడుతున్నాడు. ఈ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి.

ఆ సమావేశాలకు కేసీఆర్ రావాలనేది రేవంత్ కోరిక. కేసీఆర్ సభకు వచ్చి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. సభకు వచ్చి పెద్దరికం నిలుపుకోవాలని కూడా సలహా ఇచ్చాడు. మరి రేవంత్ రెడ్డి కోరికను కేసీఆర్ తీరుస్తాడా ? చూద్దాం ఏం జరుగుతుందో!

3 Replies to “రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా?”

Comments are closed.