విడిపోవ‌డానికి.. ఎన్నాళ్లు క‌లిసున్నామ‌న్న‌ది విష‌యం కాదా?

ఆర్థిక స్వ‌తంత్రం ఉంటే, మ‌నిషి ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా, ఎవ‌రితో అయినా క‌లిసి ఉండ‌టం అనేది జ‌రిగే ప‌ని కాద‌ని..

దేనికైనా కొన్నాళ్ల‌కు అల‌వాటు ప‌డ‌తాం అనేది మాన‌వ అల‌వాట్ల‌ను బ‌ట్టి క‌చ్చితంగా చెప్ప‌ద‌గిన అంశం. వ్య‌క్తుల‌ను భ‌రించ‌డం, వ్య‌క్తుల‌తో క‌లిసి ఉండ‌టం విష‌యంలో కూడా.. ఇదే చెల్లుబాటు అవుతుంద‌ని అనుకుంటారు చాలా మంది. తిన‌గ తిన‌గ వేము తీయ‌నుండు.. అనేది మ‌న సంస్కృతుల్లో వినిపించే మాట‌. అయితే కాపురాల వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి ఎన్నాళ్లు క‌లిసి ఉన్నామ‌నేది మాట‌లే కాదా.. అనేది కొన్ని విడిపోవ‌డాలు, విడాకుల అంశాల‌ను బ‌ట్టి చ‌ర్చ‌కు తావిస్తున్న అంశం.

ఈ ఏడాది విడాకులు పొందిన‌, విడిపోయిన ప‌లు జంట‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఎన్నాళ్లు క‌లిసి ఉన్నార‌నేది మ్యాట‌ర్ కాద‌ని, వారి వారి విశ్వాసాలు కూడా విడాకుల‌ను ఆప‌లేక‌పోయాయ‌నే అంశం స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ సంవ‌త్స‌రం కూడా ప‌లువురు సెల‌బ్రిటీలు విడాకుల‌తో వార్త‌ల్లో నిలిచారు. వీరిలో షోయాబ్ మాలిక్-సానియా మీర్జాతో మొద‌లుపెడితే ఏఆర్ రెహ‌మాన్- సైరా భానుతో పాటు స‌హ‌జీవ‌నం జంట మ‌లైకా అరోరా- అర్జున్ క‌పూర్ వ‌ర‌కూ ఉన్నారు.

వీరిలో షోయ‌బ్ మాలిక్- సానియాలు చాలా కాల‌మే కాపురం చేశారు. రెహ‌మాన్ కూడా ఎప్పుడో పెళ్లైన వాడు! పిల్ల‌లు పెద్ద‌వాళ్ల‌వుతున్న ద‌శ‌లో వీరు విడిపోయారు. వీరిలో ఏఆర్ రెహ‌మాన్ పెద్ద విశ్వాసి. ఆఖ‌రికి త‌న విడాకుల సంద‌ర్భంగా కూడా దైవాన్నే ప్ర‌స్తావించుకున్నాడు. మ‌రి దైవ విశ్వాసం అనేది కూడా మ‌నుషుల‌ను కాపురాల‌ను చేయించే భ‌యంలో పెట్ట‌లేద‌నుకోవాలేమో! వివాహ వ్య‌వ‌స్థ‌కు మ‌తాన్ని ముడిపెట్టుకోవ‌డం ఎప్ప‌టి నుంచినే వ‌స్తూ ఉన్న‌దే. పెళ్లిళ్లను దైవ సాక్షిగానే చేస్తారు అన్ని మ‌తాల్లోనూ. త‌మ ప్ర‌తి క‌ద‌లికా దైవానుగ్ర‌హ‌మే అని న‌మ్మే ఏఆర్ రెహ‌మాన్ లాంటి వాళ్ల వివాహాన్ని దైవ‌మే నిల‌వ‌లేక‌పోయింది. ప‌గిలిన హృద‌యాల ప్ర‌కంప‌న‌ల‌కు దేవుడి సింహాస‌నం కూడా క‌దిలిపోతుందంటూ రెహ‌మాన్ కోట్ చేసుకొచ్చాడు!

ఇక విడిపోవ‌డానికి వివాహ‌మే అక్క‌ర్లేదు, సుదీర్ఘ స‌హ‌జీవ‌నం కూడా బోర్ కొడుతుంద‌ని అర్జున్ క‌పూర్- మ‌లైకా అరోరా జంట నిరూపించింది. దాదాపు ద‌శాబ్ద‌కాలం నుంచి వీరు స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్టుగా ఉన్నారు. ఈ స‌హ‌జీవ‌నం వ‌ల్లనే మ‌లైకా త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చింద‌ని ఎప్పుడో ప‌దేళ్ల కింద‌ట బాగా చ‌ర్చ జ‌రిగింది. అప్ప‌టికే పిల్ల‌లున్న‌, వ‌య‌సులో త‌న‌క‌న్నా చాలా పెద్ద‌దైన మ‌లైకాతో అర్జున్ క‌పూర్ ఆ త‌ర్వాత అధికారికంగా చ‌ట్టాప‌ట్టాలేసుకు తిరిగాడు. పెళ్లి అనే ఊసు వీరు ఎత్త‌లేదు కానీ, స‌హ‌జీవ‌నాన్ని అయితే ధృవీక‌రించారు. అయితే అంత‌లా అతుక్కుపోయిన వీళ్లు కూడా ప‌దేళ్ల త‌ర్వాత విడిపోవ‌డం గ‌మ‌నార్హం! వ‌య‌సు వ్య‌త్యాసాలు, వివాహాలు ఏవీ వీరు క‌లిసి ఉండ‌టాన్ని ఆప‌లేదు కానీ, వాళ్ల‌లో వాళ్లు మాత్రం క‌లిసి ఉండ‌లేక‌పోయారు. విడిపోయారు!

ఇక కొంత కాల‌మే వైవాహిక జీవితాన్ని కొన‌సాగించి ఈ ఏడాది విడిపోయిన జంట‌ల్లో హార్దిక్ పాండ్యా- న‌టాశా జంట నిలుస్తుంది. వీరు నాలుగేళ్ల కింద‌ట పెళ్లి చేసుకున్నారు. అంత‌కు ముందు కొంత కాలం పాటు డేటింగ్ చేశారు. ఒక పిల్లాడు పుట్టాడు. అయితే ఇక క‌లిసి ఉండ‌లేమ‌ని, ఒక‌రికొక‌రు పూర్తిగా బోర్ కొట్టేశామ‌ని వీరు తొంద‌ర‌గానే నిర్ణ‌యించుకున్న‌ట్టుగా ఉన్నారు. దీంతో ఎంచ‌క్కా ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. చిన్న పిల్లాడు కూడా ఈ జంట‌ను క‌లిపి ఉంచ‌లేక‌పోయాడు!

దేశాల‌ను జాతుల‌ను దాటించిన ప్రేమ‌లు, ప్ర‌పంచ పోక‌డ‌ల‌కు విరుద్ధ‌మైన రీతిలో స‌హ‌జీవ‌నాలు చేసుకున్న వాళ్లు, ఎవ‌రేమ‌నుకున్నా త‌మకు నచ్చిందే ప్రేమ‌నుకున్న వాళ్లు, త‌మ‌కు ఎన్నో శృంగార సంబంధాలున్నాయ‌ని చెప్పుకుని సైతం ఇంకోరిని పెళ్లి చేసుకున్న వాళ్లు… ఇలాంటి వాళ్లు కూడా విడిపోతార‌ని, విడిపోవ‌డంలో పెద్ద వింత లేద‌ని ఇలాంటి జంట‌లు ఈ ఏడాదిలో సందేశాన్ని ఇచ్చాయి!

ఆర్థిక స్వ‌తంత్రం ఉంటే, మ‌నిషి ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా, ఎవ‌రితో అయినా క‌లిసి ఉండ‌టం అనేది జ‌రిగే ప‌ని కాద‌ని, అన్నీ ఉన్నా క‌లిసి ఉంటున్నారంటే వాళ్లు గొప్ప వాళ్లు అని, లేదా స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం ఉన్న వాళ్ల‌ని మ‌రోసారి చెప్పుకోవ‌డానికి విడిపోయిన ఈ జంట‌లు ఆస్కారం ఇస్తున్నాయి. వీరి మ‌ధ్య‌నే ఈ ఏడాది ఐశ్వ‌ర్య‌రాయ్- అభిషేక్ బ‌చ్చ‌న్ ల విడాకుల రూమ‌ర్లు కూడా ప‌లు సార్లు వ్యాపించి, ఆ త‌ర్వాత త‌గ్గుముఖం ప‌ట్టి, మ‌ళ్లీ ఊపందుకుంటున్నాయి! వీరిదీ సుదీర్ఘ దాంప‌త్య‌మే సెల‌బ్రిటీల లెక్క‌లో చూస్తే!

7 Replies to “విడిపోవ‌డానికి.. ఎన్నాళ్లు క‌లిసున్నామ‌న్న‌ది విష‌యం కాదా?”

  1. నీతి జాతి నియమం ధర్మం.. ఇవి నశించినప్పుడు సమాజం బ్రష్టు పడుతుంది…

  2. అందుకే 16 లోపు వివాహం అనేది. పాతదేవదాసు సినిమాలో సముద్రాలవారు ఒకపాటరాశారు ” కలయిదని నిజమిదనీ” ఆ పాటలో ఒకమాటంటారు. ఎదినేరనిప్రాయాన తనువున రవళించినరాగమ్మే స్థిరమ్మైనిలిచేనులె .బాల్యవివాహం మూలసూత్రమే అది .

    ఏదీసంపూర్ణంగాతెలియనివయసులో స్త్రీపురుషులమధ్య

    ఏర్పడే స్నేహంలాంటి ఆరాధనే కలకాలం నిలిచివుంటుంది ఇప్పుడేంచేస్తున్నాం ?చదువులుపూర్తయి వయసుదాటిన

    తరువాత వివాహం .ఈలోగా సంపాదన,అహంకారం తోపాటుగా వాళ్ళవాళ్ళపరిచయాలువాళ్ళవి .కాపురాలునిలిచేనా?

Comments are closed.