సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డితో కలిసి టీడీపీ నేతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే కారణంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి విచారణకు సోమవారం హాజరయ్యారు. పులివెందులలో రాఘవరెడ్డి ఇంటికి వెళ్లి రెండు రోజుల క్రితం పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో న్యాయవాది ఓబుల్‌రెడ్డితో కలిసి రాఘవరెడ్డి కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. కొంత కాలంగా రాఘవరెడ్డి అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఏపీ హైకోర్టులో రాఘవరెడ్డికి తాత్కాలిక ఉపశమనం లభించింది.
రాఘవరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు అడ్డంకి ఏర్పడింది. దీంతో రాఘవరెడ్డి విచారణకు ధైర్యంగా హాజరయ్యారు. కడప ఎంపీ ఏపీ కావడంతో రాఘవరెడ్డిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆయన్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం వుంది. అయితే ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించడంతో పోలీసులు సమయం కోసం వేచి చూస్తున్నారు. పూర్తిస్థాయిలో బెయిల్ లభిస్తుందా? లేక అరెస్ట్‌కు రానున్న రోజుల్లో దారి తీస్తుందా? అనేది చూడాలి.
తెలియదు, గుర్తు లేదు, మరిచిపోయాను..
తెలియదు, గుర్తు లేదు, మరిచిపోయాను