ఇప్పుడు ఒకప్పటిలా లేదు. జీఎస్టీ, టీడీఎస్ లాంటివి ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవాలి. ఇన్ టైమ్ లో కట్టేయాలి. అక్కడి డబ్బులు ఇక్కడికి, ఇక్కడి డబ్బులు అక్కడికి పంపిస్తే ప్రభుత్వం వైపు నుంచి డేగ కన్ను పడుతూనే ఉంటుంది. గతంలో కేవలం ఇన్‌కమ్ టాక్స్ సోదాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఈడీ, జీఎస్టీ, టీడీఎస్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. దీనికి తోడు ఏవైనా తప్పులు దొరికితే పనిష్‌మెంట్‌లు, పెనాల్టీలు గట్టిగా పడుతున్నాయి. పనిష్‌మెంట్‌లు సంగతి అలా ఉంచితే, పెనాల్టీలు మాత్రం భారీగా వేస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు నిర్మాతలకు ఈ రకమైన పన్ను పెనాల్టీ పోటు గట్టిగా తగిలినట్లు తెలుస్తోంది. ఒక నిర్మాత, పాపం చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నారు. ఒక యంగ్ హీరోతో ఆయన తీసిన సినిమా బయ్యర్లతో పాటు ఆయనను కూడా కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం అన్నీ క్లియర్ అప్ చేసుకుని, ఓ సినిమా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏదో అమౌంట్ లెక్కల్లో చూపకో లేదా ఆ అమౌంట్‌కు పన్ను కట్టకో ఇబ్బందుల్లో పడ్డారని, దానికి గాను కన్‌సర్న్ డిపార్ట్‌మెంట్ ఏకంగా పదుల కోట్ల పెనాల్టీతో నోటీసు వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు దాని మీద కిందా మీదా అవుతున్నారని తెలుస్తోంది.
మరో నిర్మాత సౌండ్‌గానే ఉన్నారు. లాభాల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 2025లో విడుదల ఉండొచ్చు. కానీ ఆయనకు కూడా ఎక్కడో లెక్కల్లో తేడా వచ్చి, పదుల కోట్లలో పెనాల్టీ పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాని మీద మీటింగ్‌లు నడుస్తున్నాయి.
ఇలా పదుల కోట్లలో పెనాల్టీలు పడితే కోర్టులు, అప్పీళ్లు జరిగి జరిగి, చివరకు ఎంతో కొంత కట్టి బయటపడడం జరిగేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. ముందు కట్టేసి, తర్వాత మాట్లాడాల్సిందే. అదే పెద్ద సమస్య.