అవసరమైతే కేసు వెనక్కు తీసుకుంటా

అల్లు అర్జున్, సంధ్య థియేటర్ కు రావడంలో తప్పేం లేదు. అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను.

సంథ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతికి సంబంధించి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీని అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు పూర్తి చేసి, నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు బన్నీకి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి అసలు వ్యక్తి భాస్కర్ స్పందించాడు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవతి భర్త ఇతడు. జరిగిన దుర్ఘటనపై కేసు వేసింది ఇతడే. బన్నీ అరెస్టయిన విషయాన్ని తనకు పోలీసులు చెప్పలేదని, బన్నీ తప్పేం లేదని అంటున్నాడు భాస్కర్.

“అల్లు అర్జున్, సంధ్య థియేటర్ కు రావడంలో తప్పేం లేదు. అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్టు న్యూస్ చూసి తెలుసుకున్నాను. పోలీసులు నాకేం చెప్పలేదు.”

ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించాడు భాస్కర్. ప్రస్తుతం ఇతడి కొడుకు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తన కొడుకు ఇంకా కోలుకోలేదని తెలిపిన భాస్కర్.. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంలో తప్పు లేదంటున్నాడు.

15 Replies to “అవసరమైతే కేసు వెనక్కు తీసుకుంటా”

  1. A సర్టిఫికెట్ ఇచ్చిన సినిమా కి పదేళ్ళలోపు లేక పదిహేనేళ్ళ లోపు పిల్లలను థియేటర్ కి తీసుకెళ్లి చూపించే పేరెంట్స్ మీద కూడా కేసు వెయ్యాలి..

  2. A-సర్టిఫికెట్-ఇచ్చిన-సినిమా-కి-పదేళ్ళలోపు-లేక-పదిహేనేళ్ళ-లోపు-పిల్లలను-థియేటర్ కి-తీసుకెళ్లి-చూపించే-పేరెంట్స్ మీద-కూడా-కేసు- వెయ్యాలి..

  3. Ante case pettinapudu what he was expecting. Appudu enduku pettav ippudu enduku vapas tisukunta antunnav. Arjun tappu lekapote 25 lakhs enduku tisukunnav. first case retrun tisukunte Arjun ni vadelise taruvata tappudu case petti nanduku vedini lopa veyali .

Comments are closed.