అల్లుఅర్జున్‌కు 14 రోజులు రిమాండ్!

కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్‌ను చిక్కులోకి నెట్టింది. అభిమానులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.

అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ఆయనను హాజరుపర్చారు. కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ తీర్పుతో అల్లు అర్జున్‌కు పెద్ద షాక్ తగిలింది. న్యాయస్థానం తీర్పు వెలువరించగానే, అల్లు అర్జున్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇది కేవలం యాజమాన్య వైఫల్యమా, లేక పెద్ద ఎత్తున నిర్వహణలో ఉన్న లోపాల ఫలితమా అన్న దానిపై వివాదం కొనసాగుతోంది.

కోర్టు ఆదేశాలతో అల్లుఅర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ జైలుకు తరలింపుతో అభిమానులు భారీగా చేరుకునే అవకాశముండటంతో చంచల్‌గూడ జైలులో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

9 Replies to “అల్లుఅర్జున్‌కు 14 రోజులు రిమాండ్!”

  1. A-సర్టిఫికెట్-ఇచ్చిన-సినిమా-కి-పదేళ్ళలోపు-లేక-పదిహేనేళ్ళ-లోపు-పిల్లలను-థియేటర్ కి-తీసుకెళ్లి-మరీ-చూపించే-పేరెంట్స్ మీద-కూడా-కేసు- వెయ్యాలి..

  2. @A-సర్టిఫికెట్-ఇచ్చిన-సినిమా-కి-పదేళ్ళలోపు-లేక-పదిహేనేళ్ళ-లోపు-పిల్లలను-థియేటర్ కి-తీసుకెళ్లి-చూపించే-పేరెంట్స్ మీద-కూడా-కేసు- వెయ్యాలి..

Comments are closed.