అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్ర‌బాబు!

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉన్నార‌ని మాజీ సీఎం, దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి, వైసీపీ నాయ‌కురాలు నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న అరోప‌ణ చేశారు.

టాలీవుడ్ అగ్ర‌హీరో అల్లు అర్జున్ అరెస్ట్ రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బ‌న్నీని అరెస్ట్ చేయ‌డం అంటే ఆయ‌న అభిమానుల్ని రాజ‌కీయంగా వ్య‌తిరేకం చేసుకోవ‌డ‌మే అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య మంత్రి కొండా సురేఖ సీనియ‌ర్ హీరో నాగార్జున కుటుంబంపై నోరు పారేసుకుని, ప‌రువు న‌ష్టం కేసు ఎదుర్కొంటున్నారు. ఈ సంద‌ర్భంలో నాగార్జున‌కు చిత్ర‌ప‌రిశ్ర‌మ అండగా నిలిచింది.

ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయ‌డం ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌మ‌నే సంకేతాలు పంపిన‌ట్టు అవుతుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజ‌కీయంగా న‌ష్టం చేసే ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోడానికి ముందు ఆలోచించారా? లేదా? అనే చ‌ర్చ న‌డుస్తోంది.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇప్ప‌టికే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఏపీ నుంచి కూడా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉన్నార‌ని మాజీ సీఎం, దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి, వైసీపీ నాయ‌కురాలు నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న అరోప‌ణ చేశారు. ల‌క్ష్మీపార్వ‌తి స్పందిస్తూ రాజ‌మండ్రి పుష్క‌రాల్లో, అలాగే కందుకూరులో చంద్ర‌బాబు వ‌ల్ల జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఎంతో మంచి చ‌నిపోయార‌న్నారు.

ఈ లెక్క‌న బాబును పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆమె నిల‌దీశారు. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు బాబును అరెస్ట్ చేయ‌కుండా, ఇప్పుడు ల‌క్ష్మీపార్వ‌తి నిల‌దీయ‌డం ఆశ్చ‌ర్యంగా వుంది. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ రాజ‌కీయ రంగు పులుముకుంది.

31 Replies to “అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్ర‌బాబు!”

  1. వైసీపీ ki సలహాదారునిలే కావాలి ::

    నోమినిస్ are:

    వీరగంధం ల పార్వతి

    పీసా శ్యామల రెడ్డి

    ప్రతివ్రత శ్రీరెడ్డి

    1. అందరు ఒకటి ఎలాగూ అవుతారు శ్యామల శ్రీ రెడ్డి అన్నం పెట్టిన కుటుంబం బాగుండాలని కోరుకుంటారు కానీ అన్నం పెట్టిన ఆయన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు నాశనం కావాలని ఏడ్చేది ఈవిడ

  2. మొన్న మోహన్ బాబు మీద కూడా ఇష్టం వచ్చినట్టు బోలెడు సెక్షన్స్ కింద కేసులు వేశారు…నాకు తెలిసి దీనివెనుక సిబిఎన్ హస్తం ఉంది. ఎందుకంటే మోహన్ బాబుకు సిబిఎన్ కి మధ్య పాత కోపాలు తాపాలు చాలా ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ని ఇలా అరెస్టు చేయడం ఎలా 14 రోజులు రిమాండా..? ఏమిటో మరి. అసలు రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా చెత్త సర్కారు.

  3. మొన్న మోహన్ బాబు మీద కూడా ఇష్టం వచ్చినట్టు బోలెడు సెక్షన్స్ కింద కేసులు వేశారు…నాకు తెలిసి దీనివెనుక సిబిఎన్ హస్తం ఉంది. ఎందుకంటే మోహన్ బాబుకు సిబిఎన్ కి మధ్య పాత కోపాలు తాపాలు చాలా ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ని ఇలా అరెస్టు చేయడం ఎలా 14 రోజులు రిమాండా..? ఏమిటో మరి. అసలు రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా చెత్త సర్కారు.

  4. Meeru asalu manushulena GA…Kastam lo vunna vallaki paisa sahayam cheyyaru…. siggu lekunda prathidi rajakeeyaniki vaadukovadame…..bail vasthundira babu….chiranjeevi garu vundaga mega family ni yemi cheyyaleru…WAIT CHEY

  5. వైసీపీ..వాళ్లకు..బుర్రలేదు, ఒక..పిచ్చోడిని..నేషనల్..హీరోను..చేస్తున్నారు. జగన్..చేతిలో..కుక్కచావు..చచ్చి, మోడీ..కాళ్ళు..పట్టుకొని..EVM..లతో..గెలిచాడు, చేతకాని..మనిషిని..హీరోను..చెయ్యవద్దు, హీరో,,అంటే..అది..జగన్..మాత్రమే, ప్రజల..మనసు..గెలిచినవాడే..నిజమయిన..హీరో.

  6. ఇన్నాళ్లకి లేచావా మళ్ళీ?

    ఒకవేళ చంద్రబాబు కి కక్ష ఉండి అరెస్ట్ చేయించాలి అంటే, అల్లు అర్జున్ పేరు ఆఖరు నా ఉంటుంది. ముందు మీరంతా లోపలికి వెళ్తారు. అది ఆయన నైజం కాదు. నువ్వు మూసుకో

Comments are closed.