మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి

బన్నీకి ఇంటీరియమ్ బెయిల్ లభించింది. కథ సుఖాంతం అయింది. వార్తల ప్రెజెంటేషన్ హడావుడి ముగిసింది మీడియాకు.

హమ్మయ్య.. ఓ వ్యవహారం సద్దు మణిగింది. ఈ ఉదయం హీరో అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్లిన దగ్గర నుంచి సాయంత్రం వేళ తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం వరకు ఒకటే హడావుడి. ఉత్కంఠ. టాలీవుడ్ మొత్తం వెళ్లి బన్నీకి బాసటగా నిలవడం. మీడియా దృష్టి మొత్తం దీని మీదే వుండడం. ఒకటి కాదు. రెండు కాదు. మొత్తం హడావుడి.

బన్నీని అరెస్ట్ చేయడం దగ్గర స్టార్ట్ అయింది. మీడియా హడావుడి. వీడియోల పరంపర. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం. అక్కడ హడావుడి దిల్ రాజు, అల్లు అరవింద్, బన్నీ వాస్ లాంటి వాళ్లంతా అక్కడకు వెళ్లడం. తరువాత మైత్రీ రవి, సితార నాగవంశీ వెళ్లడం. ఈ లోగా బన్నీ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు రావడం ఇవన్నీ హడావుడి, వార్తా విశేషాలే.

కానీ ఈ లోగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాదిరిగా నాంపల్లి కోర్టు జడ్జ్ మెంట్ వచ్చింది., 14 రోజులు రిమాండ్ విధించారు. దాంతో ఫ్యాన్స్ లో కలవరం. ఇంతలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేసారు. దాని మీద బన్నీ తరపున నిరంజన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. గోదావరి పుష్కరాల ఉదంతంతో సహా అనేక ఉదాహరణలు ఇచ్చారు. ఒక దశలో నిరంజన్ రెడ్డి వాదనలతోనే కేసు గెలిచిపోతుంది అనే ఫీల్ వచ్చింది హైకోర్టు లైవ్ చూస్తున్న వారికి. ప్రభుత్వ లాయర్లు కూడా వారి ప్రయత్నం వారు చేసారు.

ఆఖరికి జడ్జ్ మెంట్ వచ్చింది. బన్నీకి ఇంటీరియమ్ బెయిల్ లభించింది. కథ సుఖాంతం అయింది. వార్తల ప్రెజెంటేషన్ హడావుడి ముగిసింది మీడియాకు. ఇక అనాలసిస్ లు, కథనాలు అల్లుకోవడమే మిగిలింది.

ఈ మధ్యలో హీరో నాని, రాజకీయ నాయకులు లక్ష్మీ పార్వతి, అంబటి రాంబాబు, రఘురామకృష్ణంరాజు, మాజీ ముఖ్యమంత్రి జగన్ లాంటి వాళ్ల మద్దతు బన్నీకి లభించడం చమక్కులు అనుకోవాలి.

7 Replies to “మార్నింగ్ టు ఈవెనింగ్.. ఒకటే హడావుడి”

Comments are closed.