హత్య కేసు.. హీరోకు రెగ్యులర్ బెయిల్

వీరాభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ కు ఎట్టకేలకు ఊరట లభించింది.

వీరాభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయనకు రెగ్యులర్ బెయిల్ దొరికింది. ఈ మేరకు కర్నాటక హైకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.

నిజానికి దర్శన్ ఆల్రెడీ బయట ఉన్నాడు. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు కోర్టు అతడికి 6 వారాల అత్యవసర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సాధారణ బెయిల్ కిందకు మార్చింది.

దర్శన్ కు మాత్రమే కాదు, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడకు కూడా ఈ కేసులో బెయిల్ దొరికింది. మరో ఐదుగురికి కూడా ఊరట లభించింది. అరెస్ట్ అయిన 6 నెలల తర్వాత వీళ్లందరూ ఈ కేసు నుంచి బెయిల్ పై బయటకొచ్చారు.

జూన్ 9న రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. జూన్ 11న దర్శన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్యలో అతడి ప్రమేయం ఉందంటూ బలమైన సాక్ష్యాలు సేకరించారు. అలా సెప్టెంబర్ లో 3991 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత 3 వారాలకు అనుబంధ ఛార్జ్ షీట్ కూడా కోర్టుకు సమర్పించారు.

ఈ గ్యాప్ లో దర్శన్ ను పరప్పర అగ్రహార జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత అతడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాడు. వైద్యులు సర్జరీకి సిఫార్స్ చేయడంతో కోర్టు అనుమతిచ్చింది. ఇప్పుడు అతడికి సాధారణ బెయిల్ మంజూరు చేసింది.

4 Replies to “హత్య కేసు.. హీరోకు రెగ్యులర్ బెయిల్”

Comments are closed.