ఏపీ నుంచి రాజ్యసభకు.. తెలంగాణలో యాక్టివ్ గా ఉంటాడట!

ఏపీలో రాజ్యసభకు పంపడానికి బీసీ నాయకులు కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. అదీ సమంజసంగానే ఉంది కదా.

తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య అదృష్టవంతుడు. ఆయన కోరుకోకుండానే ఏపీ నుంచి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యాడు. తెలంగాణకు చెందిన ఆయన్ని ఏపీ నుంచి జగన్ ఒకసారి రాజ్యసభకు పంపగా, తాజాగా బీజేపీ రాజ్యసభకు పంపింది.

జగన్ పార్టీ ఓడిపోయిన వెంటనే కృష్ణయ్య పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కృష్ణయ్యను బీజేపీ రాజ్యసభకు పంపడానికి ప్రధాన కారణం తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమేనని తెలుస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణలో యాక్టివ్‌గా ఉండాలని కృష్ణయ్యకు చెప్పారని తెలంగాణ బీసీ నాయకులు చెప్పుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్య సీఎం అవుతాడని కూడా చెబుతున్నారట. 2014 ఎన్నికల్లో కృష్ణయ్య టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అప్పట్లో టీడీపీ అధికారంలోకి వస్తే కృష్ణయ్య సీఎం అవుతాడని ఆ పార్టీ చెప్పింది. ఆ తరువాత కృష్ణయ్య టీడీపీ నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఏ పార్టీలోనూ ఇప్పటివరకు స్థిరంగా, కమిటెడ్‌గా ఉండలేదు.

వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనా, పార్టీ ఓడిపోగానే దాన్నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు కూడా రాజ్యసభకు ఎన్నికవడానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే బీజేపీలో చేరాడు. ఈ పార్టీలో ఎంత కాలం ఉంటాడో తెలియదు. ఇదిలా ఉంటే, ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావడానికి కావలసిన అర్హతలున్న ఒరిజినల్ అండ్ సీనియర్ నేతలు కొందరున్నారు.

వారిని కాదని కృష్ణయ్యకు సీఎం పదవి కట్టబెడతారా? ఏపీ బీజేపీలో కూడా కృష్ణయ్య పట్ల అసంతృప్తి ఉంది. ఏపీలో రాజ్యసభకు పంపడానికి బీసీ నాయకులు కరువయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. అదీ సమంజసంగానే ఉంది కదా.

వైసీపీ కృష్ణయ్యను రాజ్యసభకు పంపినప్పుడు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆంధ్రా నుంచి రాజ్యసభకు వెళ్లిన కృష్ణయ్యను ప్రధాని మోడీ తెలంగాణలో యాక్టివ్‌గా ఉండమనడం ఏమిటో అర్థం కావడంలేదంటున్నారు. కృష్ణయ్య వల్ల బీజేపీకి ఏమీ ఉపయోగం ఉండదని తెలంగాణ బీసీ నేతలు కూడా అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎంను ప్రకటిస్తే కృష్ణయ్య కేసీఆర్‌కు మద్దతు ఇచ్చాడని అంటున్నారు. ఏదేమైనా, కృష్ణయ్య తెలంగాణలో యాక్టివ్ అయితే ఇక్కడి బీసీ నేతలు ఇబ్బందులు పెడతారనే టాక్ వస్తోంది. మరి కృష్ణయ్య ఎంత యాక్టివ్‌గా ఉంటాడో, బీజేపీ ప్రయోజనాలను ఎంతవరకు కాపాడతాడో చూడాలి.

6 Replies to “ఏపీ నుంచి రాజ్యసభకు.. తెలంగాణలో యాక్టివ్ గా ఉంటాడట!”

  1. బీ సీ ట్యాగ్ పెట్టుకుని లాభ పడుతున్నాడు కాని… బీ సీ లకు ఈయన గారు చేసింది, పోరాడింది శూన్యం

  2. వైసీపీ నుంచీ ఎంపీ ని చేసి పంపినప్పుడే గట్టిగా అడిగుంటే ఇప్పుడు గొంగట్లో అన్నం వెతుక్కోవాల్సిన పని వుండేది కాదు..

    అసలు తెలంగాణా లో ఉనికే లేని వైసీపీ కి తెలంగాణ నుంచి అతన్ని రాజ్యసభ కి ఎందుకు పంపాలి..?

    .

    అలాగే పరిమళ్ నత్వాని సంగతేంటి..ఎంత వెబ్ సైట్ నీదైతే మాత్రం నీక్కావాల్సిన క్వెస్షన్స్ మాత్రమే అడిగితే ఎలా..

  3. వైసీపీ-నుంచీ-ఎంపీ-ని-చేసి-పంపినప్పుడే-గట్టిగా-అడిగుంటే-ఇప్పుడు-గొంగట్లో-వెతుక్కోవాల్సిన-పని-వుండేది-కాదు “-కదా-అధ్యక్షా 

    అసలు-తెలంగాణా-లో-ఉనికే-లేని-వైసీపీ-కి-తెలంగాణ నుంచి-అతన్ని-రాజ్యసభ-కి-ఎందుకు-పంపాలి..?

    .

    అలాగే-పరిమళ్-నత్వాని-సంగతేంటి..ఎంత-వెబ్-సైట్-నీదైతే-మాత్రం-నీక్కావాల్సిన-క్వెస్షన్స్-మాత్రమే-అడిగితే-ఎలా..

Comments are closed.