ఇన్నాళ్లూ ప్రభాస్-అనుష్క కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రభాస్ తో పోటీకి రెడీ అవుతోంది అనుష్క. ప్రభాస్ సినిమా థియేటర్లలోకొచ్చిన వారం రోజులకే అనుష్క సినిమా రాబోతోంది.
ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడీ సినిమా వచ్చిన వారం రోజులుకే, అంటే ఏప్రిల్ 18కి అనుష్క నటిస్తున్న ఘాటీ సినిమా రాబోతోంది.
ఈ మేరకు ఓ చిన్న వీడియో విడుదల చేసి ఘాటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఎడిట్ సూట్ లో దర్శకుడు క్రిష్ సీరియస్ గా పనిచేస్తుంటే, ఫస్ట్ కాపీ ఎప్పుడిస్తావంటూ నిర్మాతలు అడుగుతారు. విడుదల తేదీ టాపిక్ వస్తుంది. సడెన్ గా అనుష్క ఎంట్రీ ఇచ్చి ఏప్రిల్ 18 అని చెబుతుంది. అలా ఘాటీ విడుదల తేదీని అఫీషియల్ ప్రకటించారు.
గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో థియేటర్లలోకొచ్చింది అనుష్క. ఈ ఏడాది ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. వచ్చే ఏడాది ఘాటీతో ప్రేక్షకులముందుకు రాబోతోంది