2047 విజ‌న్ వ్య‌క్తి, కులం కోసం కాదుః బాబు

విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో ఆదివారం పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగించారు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నూత‌న నినాదం 2047 విజ‌న్‌. త‌న‌ను తాను విజ‌న‌రీగా చెప్పుకునే చంద్ర‌బాబు, భ‌విష్య‌త్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను పేద‌రికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అని చెబుతున్నారు. మ‌రోసారి హైద‌రాబాద్‌పై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తెలుగు జాతి కోసం త‌యారు చేశామ‌ని చెప్పుకొచ్చారు.

విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో ఆదివారం పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. తెలుగు వాళ్ల‌కు గుర్తింపు వ‌చ్చిందంటే పొట్టి శ్రీ‌రాముల వ‌ల్లే అని ఆయ‌న అన్నారు. దేశ వ్యాప్తంగా భాషా ప్ర‌యుక్త రాష్ట్రాలు ఏర్ప‌డ‌డానికి కార‌ణం పొట్టి శ్రీ‌రాములే అని ఆయ‌న అన్నారు. తాము మాట‌లు చెప్ప‌డానికి లేమ‌ని చంద్ర‌బాబు అన్నారు. హైద‌రాబాద్‌ను తామే సృష్టించామ‌న్న అర్థంలో బాబు చెప్పుకొచ్చారు.

తెలుగుజాతి కోసం ప‌ని చేసిన దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు, ఎన్టీఆర్‌ను గుర్తు పెట్టుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మార్పు తీసుకొచ్చేందుకే 2047 విజ‌న్ డాక్యుమెంట‌రీని తీసుకొచ్చిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఒక వ్య‌క్తి లేదా కులం కోస‌మో కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

25 ఏళ్ల క్రిత‌మే తాను ఐటీని ప్రారంభించిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. పొట్టి శ్రీ‌రాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామ‌న్నారు. అలాగే ఆయ‌న ఇంటిని మెమోరియ‌ల్‌గా తీర్చిదిద్దుతామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

5 Replies to “2047 విజ‌న్ వ్య‌క్తి, కులం కోసం కాదుః బాబు”

  1. తెలంగాణ ఉద్యమం టైం లోనే రాయల తెలంగాణ ఇచ్చివుంటే బాగుండేది. ఈ కుల పిచ్చ సినిమా పిచ్చ ఉన్న మూడు నాలుగు జిల్లాలు కోస్త ఆంధ్ర లో పోయేవి. అభివృద్ధి అందరికి ఉండేది. సినిమాలను చూసి అభిమానం తో రాజకీయాలు ప్రభావితం చేసే మూర్క జనాలు ఉండేవారు కాదు. ఇప్పటికైనా ప్రత్యేక రాయలసీమ ఉద్యమయం పుట్టుక రవాలి .లేదంటే ఇప్పుడు ఆంధ్ర మొత్తం దోచేసి అమరావతి లో పెడతారు.

  2. కంప్యూటర్..సెల్ల్ఫోన్..కనిపెట్టిన, HYD..నేనే..కట్టిన, US..లో..ఉద్యోగాలు..చేసేది..నా..వలెనే, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిండెంట్..లను..చేసిన, తుఫాన్..ఆపివేసినా, కరువు..పారదోలిన..సైకిల్..పోయాలి..సైకిల్ కి..ఓటు..వేస్తె..ఉసిరివేసుకున్నట్టు, 10..ltrs..వాటర్..నుండి..1..కిలో..కరెంటు..తీస్తా..లాంటి..మతిలేని..మాటలు..మాట్లేదు..పిచ్చోడు..విసనరీ? AP..ప్రజలను..పిచ్చోళ్ళు..చేస్తున్నారు, ఇలాంటో..మతిలేని..మనిషిని..అడ్డ ముపెట్టుకొని..వీని..కుల..దోపిడీదారులు..AP..ని..పూర్తిగా..దోచుకుంటున్నారు

Comments are closed.