కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు స్వల్ప గాయాలపాలయ్యారు. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా తుమ్మల బాబును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈయన కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు.
కుడా చైర్మన్‌గా బాధ్యతల్ని తుమ్మల బాబు ఇవాళ స్వీకరించాలని అనుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార వేదిక కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిందపడ్డారు.
చిన్నరాజప్ప, పంతం నానాజీకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదని కూటమి నేతలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి భారీ సంఖ్యలో కూటమి నేతలు హాజరవడంతో వేదిక ఆ భారాన్ని తట్టుకోలేక పడిపోయినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా శుభమా అని ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే అపశృతి చోటు చేసుకుందని, కానీ పెద్దగా ప్రమాదం జరగలేదనే సంతోషం వాళ్లలో కనిపిస్తోంది.
శుభం
T hi s si te is