పవన్ సినిమా పూర్తయిందా లేదా..?

క్రిస్మస్ వస్తోంది, ఆ తర్వాత న్యూ ఇయర్ వస్తోంది. ఈ రెండు అకేషన్స్ లో ఏదో ఒకరోజు సాంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మరో 3 రోజుల్లో టోటల్ సినిమా షూటింగ్ పూర్తవుతుందని వారం రోజుల కిందట నిధి అగర్వాల్ ప్రకటించింది. ఇదే విషయాన్ని యూనిట్ లో కొందరు కీలక సభ్యులు కూడా వెల్లడించారు. మరి హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయిందా?

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడూ అయోమయంగానే సాగుతోంది. ఎప్పుడు షూటింగ్ అవుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో అర్థంకాని పరిస్థితి. మొత్తానికి కిందామీద పడి షూటింగ్ కానిస్తున్నారు.

ఫైనల్ షెడ్యూల్ మొదలైందంటూ నెల రోజుల కిందట ప్రకటించారు. మొన్నటికిమొన్న పవన్ తో దర్శకుడు చర్చలు జరుపుతున్నట్టు ఓ వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ పూర్తయిందని మాత్రం చెప్పలేకపోతున్నారు. అదే విచిత్రం.

మరోవైపు ఈ సినిమా సాంగ్ రిలీజ్ పై కూడా అదే గందరగోళం. కీరవాణి ఈ సాంగ్ కంపోజ్ చేసి చాన్నాళ్లయింది. రికార్డింగ్ కూడా పూర్తయింది. మరో 10 రోజుల్లో సాంగ్ వస్తుందన్నారు. చెప్పి 10 రోజులు దాటింది.

క్రిస్మస్ వస్తోంది, ఆ తర్వాత న్యూ ఇయర్ వస్తోంది. ఈ రెండు అకేషన్స్ లో ఏదో ఒకరోజు సాంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే అంతకంటే ముందు షూటింగ్ పూర్తయిందనే విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. షూటింగ్ అప్ డేట్ తెలిస్తే తప్ప, రిలీజ్ డేట్ పై నమ్మకం కుదరదు కదా.