ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ

20వ తేదీకి స్ట్రయిట్ రిలీజ్ ‘బచ్చల మల్లి’ మాత్రమే. దీంతో పాటు ‘విడుదల 2’, ‘యూఐ’, ‘ముఫాసా’ అనే 3 డబ్బింగ్ సినిమాలొస్తున్నాయి.

క్రిస్మస్ బరి నుంచి మరో మూవీ తప్పుకుంది. ఇప్పటికే నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాను ఫెస్టివల్ నుంచి తప్పిస్తూ అధికారిక ప్రకటన చేయగా.. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ అనే సినిమా కూడా వాయిదా బాట పట్టింది.

ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా లెక్కప్రకారం 20న రిలీజ్ అవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో 20వ తేదీకి స్ట్రయిట్ రిలీజ్ ‘బచ్చల మల్లి’ మాత్రమే. దీంతో పాటు ‘విడుదల 2’, ‘యూఐ’, ‘ముఫాసా’ అనే 3 డబ్బింగ్ సినిమాలొస్తున్నాయి.

‘సారంగపాణి జాతకం’ విషయానికొస్తే, ఈ సినిమాను ఎందుకు వాయిదా వేస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. ‘పుష్ప-2’ ఎఫెక్ట్ తోనే ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో, పూర్తి కామెడీ చిత్రంగా వస్తోంది ఇది.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా తెరకెక్కింది ‘సారంగపాణి జాతకం’. సినిమా వాయిదా పడినప్పటికీ, వినోదం మాత్రం మిస్సవదని అంటోంది యూనిట్.

2 Replies to “ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ”

Comments are closed.