మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేస్తున్న తొలినాటి నుంచి కూడా ఒకటే భయం మేధావుల్లో వ్యక్తం అవుతూ వస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగడం వలన.. ప్రాంతీయపార్టీల అస్తిత్వానికి ప్రమాదం అనే వాదన చాలాకాలంగా ఉంది.
మొత్తానికి సుదీర్ఘ కాలం తరువాత.. ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లు కేబినెట్ ఆమోదంతో.. లోక్ సభ ఎదుటకు వచ్చింది. జేపీసీకి కూడా నివేదిస్తున్నారు. లోక్ సభ గండం దాటడం పెద్ద ప్రయాస అని అనిపించడంలేదు. అయితే.. ఇప్పుడు ఈ బిల్లు చట్టరూపం దాల్చినా సరే.. కార్యరూపంలోకి రావడం 2034 లో మాత్రమే అని అర్థమవుతోంది. అది సుదీర్ఘ విరామం కింద లెక్క.
జమిలి ఎన్నికల హోరులో కొట్టుకుపోకుండా ఆలోగా అనేక చిన్న ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ప్రధానంగా తలపడుతున్న రెండు ముఖ్య కూటములలో భాగం కావడం లేదా, పెద్ద జాతీయ పార్టీలలో విలీనం కావడం తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.
పార్లమెంటుతో కలిసి అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు జాతీయ పార్టీలకు సహజంగానే కొంత ఎడ్వాంటేజీ ఉంటుంది. పైగా ఇప్పుడు బిల్లు సభ ఆమోదం పొందితే.. 2029 ఎన్నికలు కూడా ఇప్పటి తరహాలోనే జరుగుతాయి. 2029లో ఏర్పడే లోక్ సభ సమావేశం అయ్యే తొలిరోజున రాష్ట్రపతి జమిలి ఎన్నికల చట్టానికి నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తరువాత అయిదేళ్లకు అంటే.. 2034 లో తొలి జమిలి ఎన్నికలు జరుగుతాయి.
సొంతంగా అధికారంలోకి రాగలిగిన స్థాయి చిన్న ప్రాంతీయ పార్టీలకు మరీ పెద్ద దెబ్బ పడకపోవచ్చు. కానీ.. కేవలం ప్రజల గళాన్ని వినిపిస్తూ.. కొన్ని వర్గాల కోసం పనిచేస్తూ, కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తూ ఉండే చిన్న ప్రాంతీయ పార్టీలకు ఈ పరిణామాలు పెద్దదెబ్బగా మారుతాయి.
2029 ఎన్నికల నాటికే ఈ ప్రభావం గణనీయంగా కనిపిస్తుందని.. బలమైన జాతీయ పార్టీలు మరింత బలంగా తయారవుతాయని.. ఆ తరువాత కూడా మరో అయిదేళ్ల తర్వాత జమిలి నిర్వహించడం అనేది.. చిన్న పార్టీల స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని.. చిన్న పార్టీలను కాలరాచే వ్యూహం ఇది అని.. పలువురు విమర్శిస్తున్నారు.
కొన్ని వర్గాలకోసం, కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే చిన్న పార్టీలు అని రాసే బదులు వైసీపీ లాంటి పార్టీలు అని direct
గా రాయొచ్చు కదా…
తాత గారు పార్టీని ఆయన చేతులోకి తీసుకున్న తరువాత 28 సంవత్సరాలో సొంతగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిసింది లేదు. ఎప్పుడు ఎవడో ఒకడిది పట్టుకుని అధికారంలోకి రావడమే ఈ జాతీయపార్టీ. జమిలి ఎన్నికలు వచ్చేలోపు తాత గారు బుటుక్కుమంటే అప్పుడు జాతీయపార్టీ అనబడే ఈ లోకల్ పార్టీ కాషాయం పార్టీ లో కలపడమే.
Nuvvu kooda pothaav eppudo okappudu
అంటే..మేత గారు..అది మరి
2004 లో ఎంతమందిది పట్టుకుంటే అయ్యాడో కూడా చూసుకోవాలి..అడ్మిన్ అలోవ్ చేస్తున్నాడని ఓ రాసెయ్యటం కాదు..
రేయ్ ఎవుడ్రా నువ్వు..వేణు స్వామి గాడి శిష్యుడి లెక్కన్నువ్!
రే..య్..ఎ..వుడ్రా నువ్వు..వేణు..స్వా..మి గా..డి శిష్యుడు లా ఉన్నావ్!
ఐతే ఓటింగ్ మెషిన్ ల మీద లేకపోతె ఇలా ఏడవడమే నా ..ఐన సింగల్ సింహం కదా ఇలా అన్నిటికి ఏడిస్తే ఎలా….ఒకసారి హిమాలయాలు అంటాడు …ఇంకోసారి ఎదో మతలబు జరిగింది అంటాడు …కానీ అసలు విషయం తెలుసుకోడు …గంత కి తగ్గ బొంత ల మీరు కూడా అలానే ఉన్నారు
ఒక దేశం.. ఒక ఎన్నిక.. ఒక పార్టీ.. చైనా అలాగే అంత గొప్ప దేశం అయింది.. అదే మనకి ఆదర్శం కదా.. ఇంక గోలా గోడవా దేనికి…
😂😂
2027 YCP dreams over🪭
2027 dream 0ver for jagan
మన అన్నయ్య అంటున్నట్లు 2027లో జమిలి ఎన్నికలు రావా..