కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎక్క‌డ‌?

ఏనాడూ జ‌గ‌న్ వీళ్ల మాట‌ల్ని కంట్రోల్ చేయాల‌ని అనుకోలేదు. అందుకే ఫ‌లితాన్ని నేడు అనుభ‌విస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు నిత్యం వార్త‌ల్లో ఉన్న నాయ‌కుల్లో కొడాలి నాని ప్ర‌థ‌ముడు. ఆ త‌ర్వాత వ‌ల్ల‌భ‌నేని వంశీ గురించి మాట్లాడుకోవాల్సి వుంటుంది. గుడివాడ నుంచి గెలుపొందిన కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున గెలుపొందిన వంశీ, ఆ త‌ర్వాత జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేసి, టీడీపీకి శ‌త్రువ‌య్యారు.

ఇక కొడాలి నాని విష‌యానికి వ‌స్తే, చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై ఏనాడు మ‌ర్యాద‌గా మాట్లాడిన సంద‌ర్భం లేదు. కొడాలి తిట్లు వైసీపీ శ్రేణులకు వినసొంపుగా వుండేవి. వైసీపీపై త‌ట‌స్థుల్లో వ్య‌తిరేక‌త రావ‌డానికి కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి ర‌మేశ్ త‌దిత‌ర నేత‌ల తిట్లే కార‌ణ‌మ‌ని …వైసీపీ ఓడిపోయిన త‌ర్వాత ఆ పార్టీ నాయ‌కులే బ‌హిరంగంగా మాట్లాడారు.

టీడీపీకి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ టార్గెట్ అయ్యారు. వైసీపీ ఓడిపోయిన త‌ర్వాత ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఏమ‌య్యారో కూడా ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. నాడు అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు పారేసుకుని, ఇప్పుడేమో ఆచూకీ లేకుండా ఎక్క‌డో దాక్కున్నార‌న్న చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. అధికారం శాశ్వ‌తం కాద‌ని తెలిసి కూడా, విర‌వీగి నోటికొచ్చిన‌ట్టు తిట్టారు. ఇప్పుడేమో ప్ర‌భుత్వం ఏం చేస్తుందో అని భ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విడిచి హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఇలాగైతే గుడివాడ‌లో నాని, గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని రాజ‌కీయం ఎలా చేస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. నాయ‌కులుగా తామే భ‌య‌ప‌డితే, ఇక వైసీపీ శ్రేణుల‌కు దిక్కెవ‌రు? అని ఎప్పుడైనా ఈ నాయ‌కులు ఆలోచించారా? అందుకే అధికారంలో ఉన్నా, లేక‌పోయినా రాజ‌కీయాన్ని రాజ‌కీయంగా చేసి వుంటే ఇప్పుడు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం వ‌చ్చేది కాదు. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై అవాకులు చెవాకులు పేలి, త‌మ‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని కూడా న‌ష్ట‌ప‌రిచార‌నే ఆవేద‌న వైసీపీ నాయ‌కుల్లో వుంది.

ఏనాడూ జ‌గ‌న్ వీళ్ల మాట‌ల్ని కంట్రోల్ చేయాల‌ని అనుకోలేదు. అందుకే ఫ‌లితాన్ని నేడు అనుభ‌విస్తున్నారు. మ‌రోవైపు కొడాలి నానికి కంచుకోట లాంటి గుడివాడ‌లో టీడీపీ బ‌ల‌ప‌డుతోంది. రానున్న రోజుల్లో గుడివాడ‌కు కొడాలి రాక‌పోతే మాత్రం, శాశ్వ‌తంగా టీడీపీకి తానే అప్ప‌గించిన‌ట్టు అవుతుంది. ఇక గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ భ‌విష్య‌త్ ఏంటో ఆయ‌న‌కే తెలియాలి.

15 Replies to “కొడాలి, వ‌ల్ల‌భ‌నేని ఎక్క‌డ‌?”

  1. ‘దమ్ము దైర్యం ‘లేని ల0గా గాళ్ళు కలుగుల్లో ఎన్నాళ్ళు దాక్కుంటారు?? పొగబెట్టి బైటికి రప్పిస్తారు..”రెడ్ book రప్పా రప్పా” ఆడిస్తారు..

  2. ‘దమ్ము, దైర్యం ‘లేని ల0గాగాళ్ళు కలుగుల్లో ఎన్నాళ్ళు దాక్కుంటారు?? ‘పొగబెట్టి బై’టికి రప్పిస్తారు..

    “రెడ్ book రప్పా రప్పా” ఆడిస్తారు..

  3. orey GA , nuvvu vaallu thiduthunna rojullo ilaa cheyatam correct kaadhu ani okarojaina raasaavaa? cheelchi chendaadina naani, rechipoyina vamsi ani bokkalo articles raasaavu.

  4. లోకేష్ జూమ్ మీటింగ్ పెడితే కొడాలి, వల్లభనేని ప్రత్యక్షమౌతారు.

  5. You should have told your dear brother about their foul language. By the way you use to write “CBN ni raffadinchina kodali” ani… support chesina ninnu emanali

Comments are closed.