ఇంత‌కీ పెన్ష‌న్ దొంగ‌లు ఎవ‌రు? ఏమిటీ క‌థ‌!

ఎవ‌రికి వారు తాము శాసించే శక్తులం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతా త‌మ క‌నుస‌న్న‌ల్లోనే అని స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు.

ఏపీలో తెలుగుదేశం- జ‌న‌సేన- బీజేపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాకా.. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్లో ఏదైనా అమ‌లైంద‌ని చెప్పుకోవ‌డానికి ఉందా.. అంటే అది పెన్ష‌న్ల పెంపు హామీ. త‌మ‌కు అధికారం ఇస్తే వృద్ధాప్య పెన్ష‌న్ మొత్తాన్ని పెంచుతామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ ప్రచారంలో చెప్పారు! దీంతో పాటు చాలా క‌బుర్లు చెప్పారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ అమ‌లు చేసిన హామీ మాత్రం కేవ‌లం పెన్ష‌న్ పెంపు మాత్ర‌మే! అయితే ఇప్పుడు అందులో కూడా ట్విస్ట్ క‌నిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పెన్ష‌న్ల ఎత్తివేత‌కు కూట‌మి ప్ర‌భుత్వం రెడీ అయిపోయింది. ఈ విష‌యంపై తెలుగుదేశం నేత‌లు బాహాటంగానే ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున దొంగ పెన్ష‌నర్లు ఉన్నార‌ని, వాటి ఏరివేత అని వారు చెబుతూ ఉన్నారు. అయితే ఇలాంటి మాట‌లు ఎన్నిక‌ల ముందు ఏమీ చెప్ప‌లేదు.

తాము అధికారంలోకి వ‌స్తే పెన్ష‌న్ మొత్తాల‌ను పెంచుతామ‌ని చెప్పారు కానీ, పెన్ష‌నర్ల జాబితాను ప‌రిశీలించి.. ఏరివేత కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని మాత్రం చెప్ప‌లేదు! అలా చెప్ప‌క‌పోవ‌డం రాజ‌కీయ పార్టీ ల‌క్ష‌ణం అని అనుకోవాలి. అయితే పెన్ష‌న్ జాబితాలో అక్ర‌మాలు ఉన్నాయ‌ని తెలుగుదేశం నేత‌ల‌కు అప్పుడు తెలియ‌లేదా అనేది మొద‌టి ప్ర‌శ్న‌. ఎనివే.. నిజంగా అక్ర‌మార్కులు ఉంటే, వారి పేర్ల‌ను జాబితా నుంచి తొల‌గించ‌డం స‌మంజ‌స‌మే. అయితే దాదాపు ప‌దో వంతు పెన్ష‌న్ దార్లు త‌ప్పుడు ధృవ‌ప‌త్రాల‌ను స‌మ‌ర్పించి పెన్ష‌న్ల‌ను తీసుకుంటున్నార‌ని ఏపీ తెలుగుదేశం నేత‌లు వ్యాక్యానిస్తున్నారు. వారి వ‌ల్ల నెల‌కు 120 కోట్ల రూపాయ‌ల భారం ప‌డుతోంద‌ని చెబుతున్నారు. ఏడాదికి 1440 కోట్ల రూపాయ‌ల భారం అని చెబుతున్నారు.

అయితే ఇదంతా పైకి చెప్పే మాట‌లు. గ్రౌండ్ లెవ‌ల్లో ఏం జ‌రుగుతోంద‌నేది వేరే క‌థ‌. దీన్ని ఏ మీడియా ప్ర‌స్తావించ‌దు, సోష‌ల్ మీడియాలో ఇది రాదు. ఎప్పుడైతే ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి, పెన్ష‌న్ మొత్తం పెరిగిందో.. అప్పుడే గ్రౌండ్ లెవ‌ల్లో కొత్త దందా మొద‌లైంది. నెల‌కు అంత మొత్తం పెన్ష‌న్ రూపంలో వ‌స్తోందంటే.. దాంట్లో ఎలాగోలా పేరు సంపాదిస్తే చాల‌నే ఐడియా చాలా మందికి వ‌చ్చింది. వారికి రాక‌పోయినా.. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు జ‌నాల‌ను ఈ ర‌కంగా రెచ్చ‌గొడుతూ ఉన్నారు.

ప‌ల్లెల్లో అయితే.. మీ పేరు పెన్ష‌న్ జాబితాలో పెట్టిస్తాం, మాకు ప‌ది వేలు ఇవ్వండి చాలు అనే దందా ఒక‌టి తీవ్ర‌రూపానికి చేరింది. వృద్ధాప్య పెన్ష‌న్ కూడా కాదు.. ఏకంగా వికలాంగ పెన్ష‌న్ కు దందా సాగుతూ ఉంది! వృద్ధాప్య పెన్ష‌న్ జాబితాలో పేరు చేరాలంటే వ‌య‌సు చూపాలి. ఆ మేర‌కు ఆధార్ కార్డులో ఎడిట్ చేయాలి. అదంత తేలిక కాదు, అందుకే సింపుల్ గా వికలాంగ పెన్ష‌న్ అయితే వ‌య‌సు ఇబ్బంది లేదు. ఆధార్ కార్డులో ఎంత వ‌య‌సు ఉన్నా.. పెన్ష‌న్ జాబితాలోకి పేరు ఎక్కించేయాలంటే వికలాంగుల‌ని అంటే చాలు! మ‌రి అలాంటి వైక‌ల్యం ఉంద‌ని ఎలా రుజువు చేయాలంటే.. దానికి ప్ర‌భుత్వ వైద్యుడు ఇచ్చే స‌ర్టిఫికెట్ ఆధారం! దానికి కూడా ఇబ్బంది లేదు. జిల్లా ప్ర‌ధాన కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వ వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లి.. అక్క‌డ చేతులు త‌డిపితే చాలు, ఏదో ర‌క‌మైన వైక‌ల్యానికి సంబంధించిన స‌ర్టిఫికెట్ ద‌క్కుతుంది!

ప్ర‌త్యేకించి క‌ళ్లు క‌న‌ప‌డ‌టం లేదు అనే స‌ర్టిఫికెట్ కు ఫొటో ఆధారం తేలిక‌. అలాగే మూత్ర‌పిండ ఇబ్బందులు ఉన్న వారినీ వైక‌ల్యంగానే ప‌రిగ‌ణించి పెన్ష‌న్ సదుపాయం క‌ల్పిస్తున్నారు. శ‌త‌కోటి మార్గాలు అన్న‌ట్టుగా..ప్ర‌భుత్వ వైద్యుడి వ‌ద్ద లంచం ఇచ్చి వైక‌ల్యం అనే స‌ర్టిఫికెట్ తెచ్చుకుంటే మిగ‌తా ప‌ని తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు పూర్తి చేస్తారు. దానికి గానూ వారికి ప‌ది వేల రూపాయ‌ల వ‌ర‌కూ ఇచ్చుకుంటే స‌రిపోతుంది. ఎలాగూ నెల‌కు క‌నీసం మూడు వేల రూపాయ‌ల పెన్ష‌న్. ఆరు నెల‌లు గ‌డిస్తే.. అటు డాక్ట‌ర్ కు ఇచ్చేది, ఇటు తెలుగుదేశం కార్య‌క‌ర్త చేతులకు అందేదీ చెల్లిపోతుంది. ఆ పై నెల‌కు ఊరికే పెన్ష‌న్ మొత్తం చేతికి అందుతుంది!

తాము అధికారంలోకి వ‌స్తే కార్య‌క‌ర్త‌లు చెప్పిందే రాజ్యం అని తెలుగుదేశం నేత‌లు ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు, ఎన్నిక‌ల త‌ర్వాత అయితే ప‌చ్చ‌బిల్లల కాన్సెప్ట్ ను ప్ర‌వ‌చించారు. కాబ‌ట్టి.. పెన్ష‌న్ జాబితాలో ఎవ‌రి పేరు ఉండాలి, ఎవ‌రి పేరు ఉండ‌కూడ‌దు అనేదానికి ప్రాతిప‌దిక కేవ‌లం తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు చెప్పిందే త‌ప్ప ఇంకో లెక్కా ప‌త్రం లేదు! అడిగే వారు ఉండ‌రు, అడ్డుకునే వారు ఉండ‌రు. మండ‌ల స్థాయిలో ఎమ్మార్వోల‌ను కూడా గ్రామాల్లోని రెండు మూడు ఓట్లు కూడా వేయించ‌లేని తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు శాసించే ప‌రిస్థితి ఉందిప్పుడు. దీనికి రాష్ట్రంలో ఏ ప్రాంతం మిన‌హాయింపు కాదు.

రాయ‌ల‌సీమ‌లో తెలుగుదేశం ఉనికి లేని ఊర్ల‌లో.. ఆ పార్టీ జెండా ప‌ట్టిన ఒక‌టీ రెండు కుటుంబాలు ఎమ్మార్వో నిర్ణ‌యాల‌ను కూడా శాసిస్తూ ఉన్నాయి. అనంత‌పురం జిల్లాలో ఒక ఊర్లో.. త‌మ పొలం ప‌క్క‌గా వెళ్లే, వివిధ రైతుల‌కు చెందిన పొలాల‌కు దారిని ఒక కుటుంబం మూసేసింది. అది వారి పై ప‌క్క‌గా ఉన్న డెబ్బై ఎన‌భై ఎక‌రాల‌కు వెళ్లే దారి. చాలా మంది రైతులు శ‌తాబ్దాల నుంచి వాడుకుంటున్న దారి. వారికి అది త‌ప్ప మ‌రో మార్గం లేదు. చాన్నాళ్లుగా ఆ దారిని త‌మ పొలంలో క‌లిపేసుకోవాల‌ని ఆ కుటుంబం లెక్క‌లేసింది. మ్యాపుల్లో ఆ దారిని చూప‌లేద‌నే సాకుతో, ఆ ఊర్లో ఉన్న ఏకైక తెలుగుదేశం కార్య‌క‌ర్త అండ‌తో ఆ దారిని మూసేశారు. అదేంట‌ని మిగ‌తా రైతులు, సాటి రైతులు అడిగితే.. దిక్కున్న చోట‌కు వెళ్లి చెప్పుకొమ్మ‌న్నారు. దీంతో.. పంట‌లు సాగు చేసిన రైతులు.. వెళ్లి ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి వివాదాల‌పై సుప్రీం కోర్టు స్థాయిలో తీర్పు ఉంది. వ్య‌వ‌సాయ భూముల‌కు దారి అనేది ఎప్ప‌టికీ స‌మ‌స్య గా మార‌కూడ‌ద‌ని, అన్న‌ద‌మ్ముల పొలం పంపిణీల్లో కావొచ్చు, గ్రామం మ్యాపుల్లో లేక‌పోయినా.. అప్ప‌టికే వినియోగంలో ఉన్న దార్ల‌ను మూసి వేయ‌డానికి కానీ, భూముల భాగాల త‌ర్వాత పై ప‌క్క వారికి దారిని వ‌ద‌లం అన‌డానికి కానీ వీల్లేద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఎప్పుడో స్ప‌ష్టం చేసింది. దీనిపై ప్ర‌త్యేకంగా కోర్టు విచార‌ణ‌లు అక్క‌ర్లేద‌ని, ఎగువ వైపున వ్య‌వ‌సాయం చేసే వారికి.. దారి అనేది చ‌ట్ట‌బ‌ద్ద‌మైన హ‌క్కు అని న్యాయ‌స్థానం దేశానికే ఒక తీర్పును ఇచ్చింది. దీంతో ఇలాంటి వివాదాల‌ను రెవెన్యూ ఆఫీసు వారు ప‌రిష్క‌రించ‌డానికి మార్గం ఏర్ప‌డింది. ఈ వివాదాన్ని బ‌ట్టి చూస్తే.. శ‌తాబ్ద పై కాలం నుంచి వాడుక‌లో ఉన్న దారి కాబ‌ట్టి.. మ్యాపుతో సంబంధం లేకుండా.. పై ప‌క్క‌న పొలాల‌ను క‌లిగిన రైతుల‌కు అనుగుణంగా ఎమ్మార్వో నిర్ణ‌యం తీసుకోవాలి.

అయితే.. ఎమ్మార్వో ఆ వివాదంలోకి జోక్యం చేసుకోవ‌డానికి సాహ‌సించ‌లేదంటే .. ఊర్లో ఒక్క‌గానొక్క తెలుగుదేశం కార్య‌క‌ర్త ప‌వ‌ర్ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ దారిని మూసేసింది తెలుగుదేశం కార్య‌క‌ర్త కుటుంబం కాదు, మూసేయ‌డానికి ముందు తెలుగుదేశం కార్య‌క‌ర్త చేతుల‌ను ఆ కుటుంబం త‌డిపింది. దారిని మూసేస్తే.. దాదాపు అర ఎక‌రం పొలం వారికి పెరుగుతుంది. దారిని క‌లిపేసుకుంటే మిగ‌తా రైతుల‌కు రోడ్డే లేకుండా పోయినా, వారికి పొలం విస్తీర్ణం పెరుగుతుంది. ఈ ప్లాన్ తో తెలుగుదేశం కార్య‌క‌ర్త సాయం అడిగారు. త‌నకు అందాల్సింది అంద‌డంలో.. స‌ద‌రు కార్య‌క‌ర్త రంగంలోకి దిగాడు. దీంతో మిగ‌తా రైతులు వెళ్లి ఎమ్మార్వోతో మొర‌పెట్టుకున్నా.. వారిది అర‌ణ్య రోద‌నే అయ్యింది. ఆ ఊర్లో తెలుగుదేశం పార్టీకి ఆ కార్య‌క‌ర్త ఏమీ ప‌దుల ఓట్లువేయించినోడు కాదు. త‌న ఇంట్లో ఓట్లు వేయించ‌డ‌మే గొప్ప‌. అలాంటి కార్య‌క‌ర్త అడ్డుకుంటేనే.. ఎమ్మార్వో కూడా ఊర్లో అడుగుపెట్ట‌లేని ప‌రిస్థితి. ఇదీ ఇప్పుడు ఏపీలో సాగుతున్న పాల‌న‌.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ దారి విష‌యంలో ర‌గ‌డ జ‌రిగితే, స‌చివాల‌య ఉద్యోగులు వెళ్లి.. అక్క‌డ దారి ఉంద‌ని, చ‌ట్ట‌ప‌రంగా వారికి వాడుకునే హ‌క్కు ఉంద‌ని చెప్ప‌డంతో.. వివాదం స‌ద్దు మ‌ణిగింది. అయితే ఇప్పుడు ప‌చ్చ చొక్కాల క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న పాల‌నో ఆఖ‌రికి ఎమ్మార్వో కూడా అడుగుపెట్ట‌లేని ప‌రిస్థితి! ప‌చ్చ బిల్ల పెట్టుకుని వెళితే క‌లెక్ట‌ర్ కూడా మీరు చెప్పింది చేసి పంపిస్తాడ‌ని ఒక సీనియ‌ర్ నేత బాహాటంగా ప్ర‌క‌టించాకా.. ఇక తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు జోక్యం చేసుకున్న వివాదాల్లో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఏం చేయ‌గ‌ల‌రు?

గ‌తంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మార్వోను ఈడ్చి కొట్టాడు. ఇప్పుడు ఊర్లో నాలుగు ఓట్లు వేయించ‌లేని ప‌చ్చ చొక్కా కూడా ఎమ్మార్వోను భ‌య‌పెట్ట‌గ‌లుగుతున్నాడు! ఇదీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా ఈ సారికి వ‌చ్చిన పురోగ‌తి. క‌లెక్ట‌ర్లు, ఎమ్మార్వోలు డ‌మ్మీలు అయిపోయారు. ఊర్లో దుప్ప‌టి పంచాయితీలు కూడా చేయ‌లేని వారే ఒక మండ‌ల త‌హ‌శీల్దార్ ను నియంత్రిస్తున్నాడంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌రిస్థితి కూడా అంచ‌నా వేయొచ్చు. ఈ వివాదంలో స్థానిక జ‌న‌సేన నేత‌ను సంప్ర‌దించి, ఆయ‌న రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా.. అది న్యాయ‌ప‌ర‌మైన రోడ్డు అని, చ‌ట్ట‌ప‌రంగా చేయొచ్చ‌ని దీనికి కాను.. తాము ఎక‌రాకు ఇంత అని స‌మ‌ర్పించుకుంటామ‌ని విన్న‌వించినా ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేదు. ప‌చ్చ చొక్కా త‌లుచుకుంటే.. అక్క‌డ ప్ర‌భుత్వ అధికారి, కూట‌మి పార్టీల్లోని నేత‌లు.. ఇలా ఎవ్వ‌రూ జోక్యం చేసుకోవ‌డానికి వీల్లేద‌ని ఆయ‌న కూడా చేతులెత్తేశార‌ట‌!

మ‌రి ఇలా ప‌రాకాష్ట‌కు చేరింది ఆరు నెల‌ల పాల‌నా వ్య‌వ‌హారం. రైతుల పొలాల దారుల వివాదంలోనే ఈ స్థాయిలో ప్ర‌భావితం చేస్తున్నారంటే.. ఇక పెన్షన్లు, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల గురించి వేరే చెప్పాలా! వారు చెప్పింది వేదం, చేసింది చ‌ట్టం! అయితే పెరుగుట విరుగుట కొర‌కే అనే నానుడిని కూడా ఇక్క‌డ ప్ర‌స్తావించుకోవాలి. ఏదైనా ఒక హ‌ద్దుల్లో ఉన్నంత వ‌ర‌కే. జ‌గ‌న్ హ‌యాంలో.. ఎమ్మెల్యేలు కొన్ని రైతుల‌, ప్రైవేట్ భూముల వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటేనే ప్ర‌జ‌లు స‌హించ‌లేక‌పోయారు. అయితే ఇప్పుడు ప‌చ్చ చొక్కా వేసుకున్న ప్ర‌తోడూ ఎమ్మెల్యే క‌న్నా ఎక్కువగా ఫీల‌యిపోతున్నాడు.

ఎవ‌రికి వారు తాము శాసించే శక్తులం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతా త‌మ క‌నుస‌న్న‌ల్లోనే అని స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు. దీని ఫ‌లితాలూ.. ముందు ముందు గ‌ట్టిగానే క‌నిపించ‌కుండా పోవు. ఆరు నెల‌ల్లోనే సామాన్యుల‌ను ఆక్రోశించేలా చేసే స్థాయికి వెళ్లిపోయాయి వ్య‌వ‌హారాలు. అనుకూల మీడియా ఎంత క‌ప్పెట్టినా, సోష‌ల్ మీడియాలో ఎంత గాయి గ‌త్త‌ర చేసినా.. ఒక్కో గ‌డ్డి ప‌ర‌కా.. తోడ‌యినట్టుగా ఇవే పెద్ద‌వి అవుతాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం కూడా లేదు!

10 Replies to “ఇంత‌కీ పెన్ష‌న్ దొంగ‌లు ఎవ‌రు? ఏమిటీ క‌థ‌!”

  1. Baseless alligations కి

    “బ్రాండ్ ambassidors”

    మా గ్యాస్ ఆంధ్రా and A1 ల0గా గాడు

    ఎన్నికల్లో 10 ఇంచులు లోపలికి పెట్టినా మళ్ళీ అదే FALSE PROPAGNADA నే నమ్ముకుని రాజకీయం చేస్తూ ప్రజలని ఎర్రోళ్లని చెయ్యొచ్చు అనే భ్రమలో ఉన్న A1 and గ్యాస్ ఆంధ్రా..

  2. నువ్వు మాత్రం గోడ కింద గాలి కబుర్లు మానొద్దురే పీడమొహమోడా… నువ్వు రాసిన గాలి కూతలకు ఒక్కదానికైనా ఆధారం ఉందా రా, ఏదో మీ paytm జీతగాళ్ళను సంతోషపెట్టడానికి రాసుకొంటున్నావు…

Comments are closed.