జ‌గ‌న్‌కు ఆ స‌ల‌హా ఇవ్వ‌లేదేం స‌జ్జ‌లా?

అధికారంలో వున్న‌న్నాళ్లు తాము నియంతృత్వ ధోర‌ణుల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌నే స్పృహే వుండ‌దు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌జాస్వామ్యం, హ‌క్కులు గుర్తుకొస్తుంటాయి. అధికారంలో వున్న‌న్నాళ్లు తాము నియంతృత్వ ధోర‌ణుల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌నే స్పృహే వుండ‌దు. బ‌హుశా అధికారం అనేది మ‌త్తు కావ‌డం వ‌ల్ల‌, అన్నీ మంచి ప‌నులే చేస్తున్నామ‌నే భ్ర‌మ‌లో వుంచుతుంది. అధికార మ‌త్తు దిగిన త‌ర్వాత అంద‌రూ గుర్తు వ‌స్తుంటారు. అధికారంలో ఉన్న వాళ్లు చేస్తున్న‌వ‌న్న త‌ప్పులుగా క‌నిపిస్తుంటాయి. ఇవే ప‌నులు తాము అధికారంలో ఉన్న‌ప్పుడు చేశామ‌ని అస‌లు గుర్తుండ‌దు. ఎన్నేళ్లు గ‌డిచినా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఈ ప‌రంప‌రే సాగుతూ వుంటుంది.

వైసీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూట‌మి స‌ర్కార్‌కు ఇప్పుడు నీతిసూక్తులు చెబుతున్నారు. అధికారాన్ని ఎలా ఉప‌యోగించాలో నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అయిన చంద్ర‌బాబుకు పాఠాలు నేర్పుతున్నారాయ‌న‌. ఇంత‌కూ స‌జ్జ‌ల ఏమంటారంటే… ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకే అట‌. ప్ర‌తిప‌క్షం మీద కేసులు పెట్ట‌డానికి, అలాగే అక్ర‌మ వ‌సూళ్ల కోసం కాద‌ని ఆయ‌న కూట‌మి స‌ర్కార్‌కు హిత‌వు చెప్ప‌డం విశేషం.

ఇలాంటి మంచి స‌ల‌హాలు నాడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఇచ్చి వుంటే, ఇవాళ వైసీపీకి ఈ దుస్థితి వ‌చ్చేది కాదు క‌దా అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ప్ర‌భుత్వ స‌ల‌హాదారునిగా కేబినెట్ హోదా అనుభ‌విస్తూ, జ‌గ‌న్‌కు ఆ ఒక్క‌టి త‌ప్ప‌, మిగిలిన అన్ని ప‌నులూ చేశార‌నే చెడ్డ‌పేరు స‌జ్జ‌ల తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

అందుకే క‌దా, స‌క‌ల‌శాఖా మంత్రి అని ప్ర‌త్య‌ర్థులు ముద్దుగా స‌జ్జ‌ల‌ను పిలిచేవారు. జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతూ కూట‌మి స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు చంద్ర‌బాబును అరెస్ట్ చేయొద్ద‌నే స‌ల‌హా జ‌గ‌న్‌కు ఇచ్చి వుంటే, ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏకం కాకుండా వుండేవ‌ని స‌జ్జ‌ల‌కు తెలియ‌ద‌ని అనుకోవాలా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

17 Replies to “జ‌గ‌న్‌కు ఆ స‌ల‌హా ఇవ్వ‌లేదేం స‌జ్జ‌లా?”

  1. గ్యాస్ ఆంధ్ర

    నువ్వు ఒక వెధవన్నర వెధవ అని తెలుసు. కానీ అప్పుడప్పుడు ఇలా పచ్చి నిజాలు మాట్లాడుతుంటావు. ధృతరాష్ట్రునకు దుర్యోధనుడు చేసేవి తప్పులు అని చెప్పే దమ్ము లేకపోయింది. ఆనాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనానికి హితబోధ చేసి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగేదే కాదు. అలాగే మన సద్ది రొట్టె రెడ్డి తమరు చెప్పినట్టుగా షిత్త బోధ చేసి ఉంటే ఈనాడు ఇంత హీన స్థితి ఉండేది కాదు ఏమో మరి. ధృతరాష్ట్రుడిలాగా షెడ్యూల్ ఒట్టే రెడ్డి అది తప్ప మిగిలినవన్నీ చేశాడు ఫలితం అనుభవిస్తున్నారు. మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చింది ఆలోచించడానికి గాని ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడు చెప్పింది వినడానికి కానీ కోన్ కిస్కా గొట్టం మీడియాలు చెప్పింది వినడానికి కాదు.. వాడెవడో గొట్టం గాడు ఆరే మస్తాన్ రావట ప్రస్తుతం వాడు ఎక్కడున్నాడో ఎవరికైనా తెలుసా ? వాడు చెప్పింది మన రివర్స్ రెడ్డి నమ్మడం ఏమిటి ? ఫలితం అనుభవించేది తాను వాడు కాదు అన్న సంగతి ఆవాలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉండి ఉంటే ఇవాళ ఈ పంగనామాలు వచ్చేవే కావు.

  2. నీకు ఇన్ని తెలుసుగా ఏదో సినిమాలలో చిన్న రోల్స్ చేస్తూ, సీరియల్స్ లో నటించే మన రాష్ట్రం కాని ఆవిడను అక్రమంగా నిర్భందించడం తప్పని తెలీదా సజ్జల. జగన్ భవిష్యత్తు బాగుండాలి నీవు నిజంగా కోరుకుంటే తక్షణమే వైసిపి వ్యవహారాలకు దూరంగా ఉండు. అలా కాకుండా శకునిలా దుర్యోధనుడి వినాశన్నే కోరుకుంటే వైసిపి పార్టీ భూస్థాపితం అయ్యేవరకు జగన్ వెంటే ఉండు

  3. ***ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకే అట‌. ప్ర‌తిప‌క్షం మీద కేసులు పెట్ట‌డానికి, అలాగే అక్ర‌మ వ‌సూళ్ల కోసం కాద‌ని ఆయ‌న కూట‌మి స‌ర్కార్‌కు హిత‌వు చెప్ప‌డం విశేషం.</p>

    ఇలాంటి మంచి స‌ల‌హాలు నాడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఇచ్చి వుంటే, ఇవాళ వైసీపీకి ఈ దుస్థితి వ‌చ్చేది కాదు క‌దా అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.***

    Super Super

  4. ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకే అట‌. ప్ర‌తిప‌క్షం మీద కేసులు పెట్ట‌డానికి, అలాగే అక్ర‌మ వ‌సూళ్ల కోసం కాద‌ని ఆయ‌న కూట‌మి స‌ర్కార్‌కు హిత‌వు చెప్ప‌డం విశేషం.</p>

    <p>ఇలాంటి మంచి స‌ల‌హాలు నాడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఇచ్చి వుంటే, ఇవాళ వైసీపీకి ఈ దుస్థితి వ‌చ్చేది కాదు క‌దా అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

  5. Sarle..boru gadda yela unnado cheppamanu Inka peekutha narukutha antunnada leka manishini nenu ani maaripoyada? Jagan ni dinchatam lo borugadda kodali nani ye first veella bothulu janalaki vote booth daggara baga gurthocchi Kutamiki veysaru..🙂

  6. నువ్వు పులెందుల పోలేదా గజ్జలా??

    నువ్వు మంచం మీద లేనిదే మావోడికి నిద్ర పట్టదు కదా.. ఏంటీ సంగతి?? టూ సింగిల్స్ నీ సలహాల ఫలితమే కదా??

  7. సజ్జల వైసీపీ లో ఉన్నంత కాలం వైసీపీ గెలవదు,,వాడు చంద్రబాబు మనిషి తప్పుడు

    సలహాల తో జగన్ని తప్పు తోవ పట్టించాడు

Comments are closed.