ఏపీ పైబర్ నెట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జీవీరెడ్డి… వచ్చీరాగానే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మనసు చూరగొనే చర్యలు చేపట్టారు. ఇటీవల వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో పాటు నాటి పైబర్ ఎండీ, మరో ఐదుగురికి లీగల్ నోటీసుల్ని పంపేలా జీవీరెడ్డి చర్యలు తీసుకున్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా పైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని, 15 రోజుల్లో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారాయన. ఏకంగా 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు జీవీరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ హయాంలో పైబర్‌నెట్‌లో అనేక అక్రమ నియామకాలు జరిగినట్టు ఆయన తెలిపారు. ఎవరెక్కడ పని చేస్తున్నారో , ఆఫీస్‌కు ఎవరొస్తున్నారో తెలియదని ఆయన అన్నారు. వైసీపీ నేతల వాహనాల డ్రైవర్లకు, అలాగే వాళ్ల ఇళ్లలో పనిమనుషుల్ని పైబర్‌నెట్‌లో ఉద్యోగులుగా చూపి ప్రజల సొమ్మును జీతాలుగా ఇచ్చారని ఆయన ఆరోపించారు.
న్యాయపరమైన సలహాలు తీసుకుని వీళ్లందర్నీ తొలగించినట్టు ఆయన చెప్పారు. అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్ మనసు చూరగొన్న రెండో చర్య ఇది. వర్మ నుంచి కోట్లాది రూపాయలు, అలాగే తొలగించిన ఉద్యోగుల నుంచి అంతే మొత్తంలో వసూలు చేయాలనే తపన బాగానే వుంది. అయితే ఇవన్నీ అనుకున్నంత సులువా అనేదే ప్రశ్న. మరోవైపు ఆర్జీవీ తరపు న్యాయవాది బాల మీడియాతో మాట్లాడుతూ జీవీరెడ్డి అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు.
జ్ఞానులెవరో, అజ్ఞానులెవరో కాలం తేల్చాల్సి వుంది. కానీ పైబర్‌నెట్‌లో అక్రమంగా నియమితులై, వేతనాలు పొందిన వారి నుంచి వసూలు చేస్తానంటున్న జీవీరెడ్డిని చూసి టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఆ మేరకు ప్రస్తుతానికి జీవీ సక్సెస్ అయ్యినట్టే. ఎందుకంటే రాజకీయ నాయకుల మొదటి లక్షణం…అధినేతల్ని సంతృప్తిపరచడం.
Akka money dobbina tdp president daggara collct chesi mogodivi anipinchuko lekunte inko 420 gadivi avutav
410 employees removed is highlight in this issue….
fasak
all are drivers of ycp leaders?
GV Reddy did not order for enquiry and arrest of 410 employees!
He mentioned that some are workers, drivers in the YCP leaders house who are taking salary there. Some are just appointed there with some YCP leader recommendation?
Does these people should be continued?
చిన్న ఉద్యోగులు ..మానవతా దృక్పధం తో వదిలేస్తున్నాం..వారి నుండి ఎలాంటి వసూళ్లు వుండవు. వర్మ, మధు సూధన్ రెడ్డి అనే..సై.. కో గాళ్ళకి 15 రోజులు టైంఇచ్చారు
భారతి రెడ్డి లంగాలు ఉతకడానికి అవినాష్ రెడ్డి ఉండగా, ఫైబర్నెట్ నుంచి శాలరీ ఎందుకు?
Mandi sommu urike dobbi tinna Mee Anna gurinchi rayi ra mundu…