తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మొత్తానికి తనంటే ఏమిటో ఇప్పుడు టాలీవుడ్ కు అర్థమయ్యేలా చెప్పినట్టుగా ఉన్నాడు! ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప 2 తొక్కిసలాట అంశంతో రేవంత్ ఇప్పుడు టాలీవుడ్ కు తెలంగాణ సీఎం పదవి అంటే అదెంత పవర్ ఫుల్లో అర్థం అయ్యేలా చేశాడనే టాక్ వినిపిస్తూ ఉంది! అది టాలీవుడ్ కు తెలియదని కాదు!
టాలీవుడ్ కు అన్నీ తెలుసు. అయితే అది పదవులను కాకుండా వ్యక్తులను బట్టి వెళ్తూ ఉంటుంది! తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ కు టాలీవుడ్ వంగి సలాం చేసిందనేది నిఖార్సైన వాస్తవం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా.. కేసీఆర్, కేటీఆర్ కు టాలీవుడ్ గులాం చేసింది. కేసీఆర్, కేటీఆర్ అంటే.. టాలీవుడ్ లో భయం, భక్తి, గౌరవం, స్నేహం, ప్రేమ ఇవన్నీ ఉండేవి. అవెలా వచ్చేయంటే.. హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖులు విస్తరించుకున్న సామ్రాజ్యాల వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే.. కాంగ్రెస్ సీఎంలంటే టాలీవుడ్ కు మొదటి నుంచి చిన్నచూపే! ప్రధానంగా జాతీయ పార్టీలు కావడం వల్లనో ఏమో కానీ.. మొదటి నుంచి కాంగ్రెస్ సీఎంలకు టాలీవుడ్ విలువను ఇవ్వదు. గతంలో చంద్రబాబు కు టాలీవుడ్ గులాం చేసింది. బోలెడు ప్రయోజనాలు పొందింది. వైఎస్ సీఎం అయ్యాకా కూడా.. టాలీవుడ్ దూరదూరంగానే మసలింది. అయితే సినిమా ఇండస్ట్రీని వైఎస్ అంత పట్టించుకోలేదు. చూసిచూడనట్టుగా వ్యవహరించారు. ఉపయోగించుకోవాలనుకుంటే.. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసుతో వైఎస్ ఒక ఆట ఆడుకోగలిగేవారు. అయితే ఆ రాజకీయం ఆయన చేయలేదు.
ఇక వైఎస్ అనంతరం రోశయ్య, కిరణ్ లను టాలీవుడ్ అస్సలు సీఎంలుగా చూడలేదు. వారికి కూడా సినిమా వాళ్లను పట్టించుకునేంత తీరిక ఉండేది కాదు! రాష్ట్ర విభజన తర్వాత ప్రధానంగా అందరూ ఆంధ్రా మూలాలున్న వారే కావడంతో సినిమా వాళ్లకు భయం పట్టుకుంది. దీంతో.. కేసీఆర్, కేటీఆర్ లకు బాంచన్ అన్నారు. విభజన తర్వాత సినిమా వాళ్లు టార్గెట్ అవుతారనే ప్రచారం కూడా ఉండింది. అయితే సినిమా వాళ్లతో అలాయ్ బలాయ్ కే కేసీఆర్, కేటీఆర్ ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో టాలీవుడ్ పూర్తిగా వారికి దగ్గరైంది. పదేళ్లు అలా కులాసాగా గడిచిపోయాయి.
ఇక కాంగ్రెస్ సీఎం రావడంతో.. టాలీవుడ్ యథారీతిన పాత ధోరణే కనబరిచింది. మరి ఇన్నాళ్లూ అవకాశం కోసమే చూశారో ఏమో కానీ, రేవంత్ కు మెలిక దొరికింది. ఇప్పుడు టార్గెట్ అల్లు అర్జున్ అయితే అయ్యాడేమో కానీ.. టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి తను ఎవరో, ఏమిటో ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టుగా అవుతోంది. తొక్కిసలాటలో చనిపోయిన వారి మీదే సానుభూతా, ప్రభుత్వ బాధ్యత ఇదేనా? సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఇటీవల ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్లతో ఇబ్బందుల విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు! నిజమే అన్నీ ప్రాణాలే, అయితే అవసరాన్ని, అవకాశాన్ని బట్టి.. కొన్ని ప్రాణాలకు విలువ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి రాజకీయానికి! ఇది అర్థం చేసుకోలేరా!
ఒకటి తక్కువైంది.. ఒకటి తక్కువైంది అని పుష్పకలో షెకావత్ చెప్పినట్టుగా.. ఇన్నాళ్లూ రేవంత్ విషయంలో టాలీవుడ్ ఒకటి తక్కువ చేసింది! అదే రెస్పెక్ట్! బహుశా ఇక అది టన్నులు టన్నులుగా కనిపించవచ్చు!
దమ్మున్న సీఎం
తప్పు, గర్వం ఉన్నోడు అని రాయి
ఆఖరి పేరా మాత్రం మామూలుగా పేలలేదు.. అదిరిపోయింది…
ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళ పేరు రాస్తే బాగుణ్ణు…
GA ఎలా అయినా కధ అల్లగలడు! మిమ్మలని ఏమార్చి…మీ వెలుతొ.. మీ కన్నె.. పొడిపించగలదు బులుగు మీడియా!
.
GA ఉద్దెశం అల్లు అర్జున్ ని తప్పించి….టాలీవుడ్ ని, రేవంత్ ని కూడా తకువ చెసి చూపించటమె! ఈ గొడవంతా వారి మద్య అహం తాలూకు గొడవె అన్నట్టు చూపించటం!
అందుకె కొంగ్రెస్స్ CM లంటె టాలీవుడ్ కి లెక్క లెదు అనట్ట… మరొ పక్క రెవంత్ తన ఇగొ కొసమె అల్లు అర్జున్ ని ఇబ్బంది పెడుతునట్టు రాస్తున్నాడు. అప్పట్లొ జగన్ మొహన్ రెడ్ది మాత్రమె ఇలా చెసాడు!
.
అల్లు అర్జున్ చెసిన అతి వల్లె ఆయన కష్టాలు కొని తెచ్చుకున్నాడు అన్న విషయం మాత్రం ఎక్కడా GA రాయలెదు! మరి YCP M.-.L.-.A ని సపొర్ట్ చెస్తె ఆమాత్రం కవర్ చెయడా?
GA ఎలా అయినా కధ అల్లగలడు! మిమ్మలని ఏమార్చి…మీ వెలుతొ.. మీ కన్నె.. పొడిపించగలదు బులుగు మీడియా!
.
GA ఉద్దెశం అల్లు అర్జున్ ని తప్పించి….టాలీవుడ్ ని, రేవంత్ ని కూడా తకువ చెసి చూపించటమె! ఈ గొడవంతా వారి మద్య అహం తాలూకు గొడవె అన్నట్టు చూపించటం!
అందుకె కొంగ్రెస్స్ CM లంటె టాలీవుడ్ కి లెక్క లెదు అనట్ట… మరొ పక్క రెవంత్ తన ఇగొ కొసమె అల్లు అర్జున్ ని ఇబ్బంది పెడుతునట్టు రాస్తున్నాడు. అప్పట్లొ జగన్ మొహన్ రెడ్ది మాత్రమె ఇలా చెసాడు!
.
అల్లు అర్జున్ చెసిన అతి వల్లె ఆయన కష్టాలు కొని తెచ్చుకున్నాడు అన్న విషయం మాత్రం ఎక్కడా GA రాయలెదు! మరి Y.-.C.-.P M.-.L.-.A ని సపొర్ట్ చెస్తె ఆమాత్రం కవర్ చెయడా?
పుష్ప అంటే “Revanth నలిపేసిన ప్లవరు”.
టికెట్ రేట్లు పెంచుకోవడానికి and బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు డ్రామా దె0గితే మండదా??
అదే మావోడు అయ్యుంటే, పుష్ప కి ఈపాటికే బాత్రూం లో గుండెపోటు తెప్పించేవాడు తెలుసా??
టికెట్ రేట్లు పెంచుకోవడానికి and బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు డ్రామా దె0గితే మండదా??
అదే మా 11 గాడు అయ్యుంటే, ‘పుష్పకి ‘ఈపాటికే బాత్రూంలో గు0డెపోటు తెప్పి0చేవాడు తె’లుసా??
okati takkuva ayindi .. pushpa .. dialogue enduku pettama anukuntaramo ippudu …