ముగ్గురు మృతి.. వివాహేతర బంధమే కారణమా?

ముగ్గురూ కలిసిన తర్వాత ఏమైంది, అంతా మూకుమ్మడిగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..

కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ఎస్సై ఆచూకీ ఈరోజు ఉదయం లభ్యమైంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్సై మృతదేహం లభించింది. ఇదే చెరువులో నిన్న మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు కూడా దొరికాయి. దీంతో ఈ కేసుకు సంబంధించి మృతదేహాలన్నీ దొరికినట్టయింది. ఇక తేలాల్సింది ఈ మృతి వెనక కారణాలు మాత్రమే.

కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్సై గా పనిచేస్తున్నారు సాయికుమార్. అదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది శృతి. అక్కడే కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు నిఖిల్. సాయికుమార్ కు పెళ్లయింది, ఇద్దరు పిల్లలు కూడా. శృతికి కూడా పెళ్లయింది కానీ ఆమె భర్త నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఎస్సై, మహిళా కానిస్టేబుల్ మధ్య బంధం ఏర్పడినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దర్నీ దగ్గర చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తనవంతు ప్రయత్నం చేసినట్టు అనుమానిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, అసలు కథ ఆ తర్వాత మొదలైంది.

భిక్కనూరులో డ్యూటీ చేస్తున్న సాయికుమార్ కు భిక్కనూరు ట్రాన్సఫర్ అయింది. ఇదే టైమ్ లో నిఖిల్ కు, శృతికి సాన్నిహిత్యం ఏర్పడినట్టు చెబుతారు. విషయం తెలిసిన సాయికుమార్, గట్టిగా ప్రశ్నించడంతో వివాదం ముదిరినట్టు చెబుతున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ముగ్గురూ చెరువు గట్టు దగ్గర కలిసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ముగ్గురూ కలిసిన తర్వాత ఏమైంది, అంతా మూకుమ్మడిగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. అసలు ఇవి ఆత్మహత్యలా, హత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల పోస్టుమార్టం పూర్తయి, మృతుల సెల్ ఫోన్ డేటా రికవరీ అయితే ఈ కేసును ఛేదించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

12 Replies to “ముగ్గురు మృతి.. వివాహేతర బంధమే కారణమా?”

    1. Meeru evaro kaani okati gurthuku pettukondi , Jagan sir is ex CM . Oka CM sthaayi gurinchi ila thakkuva chesi matladakandi sir. Cbn gaari gurunchi ila meelaga matladithe baagodu sir. Please speak wisely. The above article is not related to politics but your posts always related to oppose to Jagan sir

Comments are closed.