సెటప్ తీగ లాగితే.…!

బయోపిక్ డాక్యుమెంటరీ కోసమో, మరే ఇతర పనుల కోసమో ఆఫీసు నుంచి బయటకు వెళ్లిన మొత్తాల లెక్కలు బయటకు వచ్చాయని తెలిసింది.

ఒక్కోసారి అంతే… ఎక్కడో లాగితే ఏవేవో బయటకు వస్తాయి. ఇవి ఊహించడానికి అందవు. జరిగిందని తెలిసిన తరువాత చిత్రంగా ఉంటాయి. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇలాంటి ఓ కథ వినిపిస్తోంది. టాలీవుడ్‌లోని ఓ సీనియర్ టాప్ స్టార్. ఆయనకు ఓ నమ్మిన బంటు. ఆయనకే కాదు మరో సీనియర్ హీరోకి కూడా అన్నీ తానై వ్యవహరించే మనిషి. అలాంటి వ్యక్తిని ఇద్దరు హీరోలూ ఒక్కసారిగా దూరం పెట్టారు. అతగాడు లేకపోతే రోజు గడవదు అనేట్లు ఉండేది వ్యవహారం. కానీ ఉన్నట్టుండి ఇలా జరిగింది. ఎందుకిలా? అన్నది ప్రశ్న. నిజానికి ఇది ఇవాళ నిన్న జరగలేదు. రెండు మూడు నెలల క్రితం జరిగింది.

ఎలా? ఎందుకు? ఏమిటి? అని ఆరా తీస్తే చాలా సంగతులు తెలుస్తున్నాయి.

ఈ నమ్మిన బంటు చిరకాలంగా ఉన్న టాప్ సీనియర్ హీరో దగ్గరకు ఓ క్రియేటివ్ పర్సన్‌ను చేర్చారు కొన్నాళ్ల క్రితం. ఆమె సదరు హీరో బయోపిక్‌ను డాక్యుమెంటరీ మోడల్‌లో తీయాలనుకుంటున్నారు అని పరిచయం చేసారు. ఐడియా నచ్చి తానే కొంత ఖర్చు చేయడం మొదలుపెట్టారు. అలా అలా సదరు హీరో అకౌంట్‌లోంచి కొన్ని మొత్తాలు బయటకు వెళ్లడం ప్రారంభమైంది. ఇది ఒక ట్రాక్.

బయోపిక్ డాక్యుమెంటరీ తీయాలనుకున్న ఆ క్రియేటివ్ పర్సన్ ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఈ నమ్మిన బంటు ఓసారి ఓ మహిళను తీసుకువచ్చి, రెండు మూడు రోజులు ఫ్లాట్‌లో ఉంచుకోమని సదరు క్రియేటివ్ పర్సన్‌ను అడిగారు. జస్ట్ సాయం కదా అని ఓకే అన్నారు. కానీ తరువాత తెలిసింది..తన ఇంట్లో ఉంచిన మహిళకు, ఆ నమ్మిన బంటుకు మధ్య ఏదో ఉందని. ఈ లోగా ఆ నమ్మిన బంటు భార్య రంగ ప్రవేశం చేసారు. తన భర్త ఎవరినైనా తీసుకువచ్చి, మీ ఫ్లాట్‌లో ఉంచారా అని అడిగారు. దాంతో ఇదంతా ఏదో గడబిడగా ఉందని, ఈ క్రియేటివ్ మహిళ, ఆ నమ్మిన బంటు తాలూకా మహిళను బయటకు పంపారు.

మొత్తం ఉదంతం అంతా సదరు సీనియర్ హీరోకు తెలిసింది. ఏమిటిందంతా అని ఆరా తీస్తుంటే బయోపిక్ డాక్యుమెంటరీ కోసమో, మరే ఇతర పనుల కోసమో ఆఫీసు నుంచి బయటకు వెళ్లిన మొత్తాల లెక్కలు బయటకు వచ్చాయని తెలిసింది. అక్కడ కూడా తేడాలు ఉన్నట్లు తేలింది. దాంతో ఇన్నాళ్ల బంధం ఇక చాలు అని స్వస్తి పలికేసారు.

ఈ విషయం తెలిసి మరో సీనియర్ హీరో కూడా ఆ నమ్మిన బంటుకు గుడ్‌బై చెప్పేసి, ఓ చానెల్‌కు చెందిన వ్యక్తిని దగ్గరకు తీసుకున్నారు.

టాలీవుడ్ వ్యవహారాలు అంతే.. అయితే డబ్బు లేదా అమ్మాయిల చుట్టూ ఎక్కువగా తిరుగుతాయి.

8 Replies to “సెటప్ తీగ లాగితే.…!”

  1. టోలీవుడ్డే కాదు ఎక్కడైనా వ్యవహారాలన్నీ డబ్బు లేదా అమ్మాయిల చుట్టూ ఎక్కువగా తిరుగుతాయి.

Comments are closed.