భూక్రయ, విక్రయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది. అయితే కూటమి సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాబడి బాగా తగ్గిపోయినట్టు సమాచారం. ఈ విషయాన్ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖల అధికారులు తెలిపారు.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పైళ్లు తగలబడినప్పటి నుంచి ఆదాయం తగ్గింది. అప్పటి నుంచి కొన్ని రకాల భూముల రిజిస్ట్రేషన్లను నిలపాలని కూటమి సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. డీకేటీ, ఇనామ్ తదితర రకాల భూముల రిజిస్ట్రేషన్లు చేయొద్దని, వాటిని ఫ్రీహోల్డ్‌లో పెట్టారు. మూడు నెలలో సమస్యను పరిష్కరించి, తిరిగి నిజమైన భూహక్కుదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పైళ్లు దగ్ధం కావడంపై విచారణ ఏమైందో, ఎంత వరకు వచ్చిందో అంతుచిక్కని పరిస్థితి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములన్నీ రాయించుకున్నారనే ఆరోపణలు, ప్రచారాన్ని కూటమి నేతలు పెద్ద ఎత్తున చేశారు. వాళ్లకు సంబంధించిన వాళ్లే ఆధారాలు లేకుండా భూరికార్డుల్ని కాల్చేరనేది ఆరోపణ.
ఈ ఆరోపణల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కొట్టి పారేశారు. రెవెన్యూ రికార్డులన్నీ ఆన్‌లైన్ అయ్యాయని, అలాంటప్పుడు రికార్డుల్ని కాల్చేయడం వల్ల ఆధారాల్ని లేకుండా ఎలా చేయగలమని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మదనపల్లె ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించింది.
అయితే ప్రభుత్వం చెప్పినట్టు రిజిస్ట్రేషన్ల నిలుపుదల పొడిగించడంతో ఆ ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై పడినట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు వాపోతున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఫ్రీహోల్డ్ ఎత్తివేస్తామని అధికారులు చెప్పిన గడువు కూడా రెండోసారి ముగిసింది. ఇప్పుడు కొత్తగా ముచ్చటగా మూడోసారి వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేస్తామని చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో నిజమైన భూహక్కదారులు ఇబ్బంది పడుతున్నారు. డీకేటీ భూములను మినహాయిస్తే, మిగిలిన వాటి విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుంది. లేదంటే ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు, ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
మంగళవారం కబుర్లకి నెలవు ఈ..
ప్రభుత్వం వారికి వచ్చే ఆదాయ వ్యవహారాలు ప్రభుత్వానికి సంబంధించినవి. ఆదాయం పెరిగిన తరిగిన అది వాళ్ళ బాధ్యత. మధ్యలో నీకు వచ్చిన గుద్ధ నొప్పి ఏమిటో తెలియడం లేదు.నువ్వు ఇచ్చేవాడివి కాదు పుచ్చుకునే వాడివి కాదు ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగిన భారీగా తరిగిన నీకొచ్చే లాభనష్టాలు అంటూ ఏమీ లేవు. మరి దాని గురించి ఈ పోస్ట్ పెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది రా వెధవ
Prabhutvam pani chestunda leda ani thelisedi ilaage ra.
According to MP Avinash Reddy, records are uploaded on line and need not focus on files burnt accidentally in fire. But suspicious elements might have uploaded the corrupt files to their favour and then have burnt them not traceable by any investigation authorities. I smelt the rat since then.🤔🇮🇳