సవాల్…సినిమాలు వస్తున్నాయ్

కొన్ని సినిమాలు కొందరికి సవాల్ గా మారుతాయి. ముఖ్యంగా దర్శకులకు. సక్సెస్ మీదనే వారి తరువాత సినిమాలు చాన్స్ లు ఆధారపడి వుంటాయి. అందుకే చాలా మంది దర్శకులు తెలివిగా ఓ సినిమా వుండగానే…

కొన్ని సినిమాలు కొందరికి సవాల్ గా మారుతాయి. ముఖ్యంగా దర్శకులకు. సక్సెస్ మీదనే వారి తరువాత సినిమాలు చాన్స్ లు ఆధారపడి వుంటాయి. అందుకే చాలా మంది దర్శకులు తెలివిగా ఓ సినిమా వుండగానే మరోటి సెట్ చేసుకుంటారు. లేదూ అంటే పక్కన వుండిపోవాల్సి వస్తుంది.

అలాంటి సినిమాలు లైన్ గా వస్తున్నాయ్. కెజిఎఫ్ 2 సినిమా ఈవారం రాబోతోంది. ఈ సినిమా ద‌ర్శకుడు ప్రశాంత్ నీల్ అటు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమా కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ సినిమా మీద అంచనాలు పెరగాలన్నా, ఎన్టీఆర్ అవకాశం ఇవ్వాలన్నా, కెజిఎఫ్ 2 సినిమా అనుకున్న రేంజ్ కు వెళ్లాలి. అది నిజంగా ఆ దర్శకుడికి సవాల్ నే.

కొరటాల శివకు ఇప్పటి వరకు అన్నీ సక్సెస్ లే. కొన్ని సినిమాలు కమర్షియల్ గా బయ్యర్లను గట్టెక్కించలేదు. కానీ ఆయన సెట్ ఆఫ్ బయ్యర్ల పుణ్యమా అని సినిమాలు హిట్ అనిపించేసుకున్నారు. ఇప్పుడు ఆచార్య సినిమా ఆయనకు కాస్త గట్టి టాస్క్ నే. ఈ సినిమాను ఇటు కమర్షియల్ గా అటు కంటెంట్ పరంగా సక్సెస్ చేయించుకోవాల్సి వుంది. ఎందుకంటే ఈ సినిమా తరువాత చేయబోయే ఎన్టీఆర్ సినిమా మీద ఆ ప్రభావం వుంటుంది.

ఎఫ్ 3 సినిమాతో వస్తున్నారు అనిల్ రావిపూడి. ఆయన కూడా తరువాత సినిమా బాలయ్యతో రెడీ చేసుకునే వున్నారు. కానీ గత సినిమాలు ముఖ్యంగా గాలి సంపత్ మిగిల్చిన చేదు అనుభవాలు దాటాలి. లీగ్ లో లీడ్ లో నిలవాలి అంటే ఎఫ్ 3 కచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. లేదూ అంటే మళ్లీ ఇబ్బంది అవుతుంది.

పక్కా కమర్షియల్ సినిమా విడుదల చాలా వెనక్కు వెళ్లింది. నిజానికి ముందుగానే వచ్చి వుంటే మరింత సవాల్ గా వుండేది దర్శకుడు మారుతికి. ప్రభాస్ తో సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. మంచి రోజులు వచ్చాయి సినిమా ఇచ్చిన షాక్ నుంచి తెేరుకుని పక్కా కమర్షియల్ పూర్తి చేసారు ఇది పక్కాగా కమర్షియల్ హిట్ కావాలి. లేదూ అంటే ఆ ప్రభావం ప్రభాస్ సినిమా మీద పడుతుంది.

సర్కారువారి పాట సినిమాతో టాప్ లీగ్ డైరక్టర్ల లిస్ట్ లోకి వెళ్లారు పరశురామ్. గీతగోవిందం తరువాత సినిమా ఇదే. చాలా గ్యాప్ నే వచ్చింది. ఇది హిట్ కొట్టి తీరాలి. లేదూ అంటే మళ్లీ పాము నోట్లో పడి కిందకి జారిపోయనట్లు అవుతుంది పరిస్థితి. పైగా మిగిలిన డైరక్టర్ల మాదిరిగా చేతిలో రెడీగా సినిమా కూడా పెట్టుకోలేదు.

దర్శకుల సంగతి అలా వుంచితే కొందరు హీరోల పరిస్థితి ఇలా సవాల్ గానే వుంది. నాని ‘అంటే సుందరానికి’, రవితేజ‌ ‘రామారావు ఆన్ డ్యూటీ’… వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’… నాగశౌర్య ‘ కృష్ణ వ్రింద విహారి’…విష్వక్ సేన్ ‘అశోకవనంలో అర్ఙున కళ్యాణం’…గోపీచంద్ ..పక్కా కమర్షియల్..ఇవన్నీ హిట్ కాకుండా వారి సినిమాల మార్కెటింగ్ కష్టం అవుతుంది. నాని ఫ్లాపుల తరువాత శ్యామ్ సింగరాయ్ క్రిటికల్ గా ఓకె అనిపించుకుంది. కమర్షియల్ గా కాదు. రవితేజ‌ ఖిలాడీ డిఙాస్టర్…

అన్నింటికి మించి మెగాస్టార్ కు ఆచార్య హిట్ కావాలి. సైరా సినిమా డిజాస్టర్ తరువాత ఆయన చాలా సినిమాలు ఓకె చేసారు. వాటి మార్కెటింగ్ ఎలా వుండబోతోందీ తెలియాలంటే ఆచార్య లెక్కలు తేలాల్సి వుంటుంది.