Advertisement

Advertisement


Home > Movies - Press Releases

ధీర ప్రారంభం

ధీర ప్రారంభం

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కుటుంబానికి చెందిన లక్ష చదలవాడ మరో సినిమా స్టార్ట్ చేసాడు. ఇప్పటికే స్వంత బ్యానర్ మీద గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నాడు. అది రన్నింగ్ లో వుండగానే మరో సినిమాను ప్రారంభించాడు. 

ఇది కూడా హొమ్ బ్యానర్ లోనే. ధీర పేరుతో తెరకెక్కే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా, చదలవాడ శ్రీనివాసరావు కెమేరా స్విచాన్ చేసారు.

ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ వుంటుంది. సాయి కార్తీక్ సంగీత దర్ళకుడు. క్రాంత్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హీరో లక్ష ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతోంది. 

నేటితరం కోరుకునే అన్ని అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?