నిఖిల్ లేటెస్ట్ సినిమా స్పై. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ రానా. ఈ సినిమాలో రానా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడని విడుదలకు వారం రోజుల ముందు వరకు ఎవరికీ తెలియదు. అంత గోప్యంగా వుంచారా? అంటే అదీ కాదు. అసలు రానా వస్తాడనే తెలియదు.
ఈ పాత్ర ఎవరితో చేయంచాలా అన్న దాని మీద చాలా డిస్కషన్లు ఏమీ ముందుగా జరగలేదు. ఎందుకంటే ఈ పాత్ర కోసం ముందుగా ఓ పేరు అనుకున్నారు. ఆ పేరు ‘నాగ్ చైతన్య’ ఆయన కూడా అవకాశం వుంటే చేద్దామనే అన్నారు.
కానీ విడుదల డేట్ జూన్ 28 ఫిక్స్ అనుకున్నపుడు, టైమ్ సరిపోలేదు. నాగ్ చైతన్య విదేశాల్లో వున్నారు. దాంతో అప్పుటికప్పుడు హడావుడి మొదలైంది. ఎవరు..ఎవరు..ఎవరు..చాలా పేర్లు అనుకున్నారు. కానీ ఎవ్వరూ అందుబాటులో లేరు. దాంతో హీరో నిఖిల్ తనకు బాగా సన్నిహితుడైన రానా ను అప్రోచ్ అయ్యారు. ఓకె అన్నారు.
విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు ఈ ఎపిసోడ్ షూట్ చేసేసారు. స్క్రిప్ట్ ప్రకారం అయితే ఈ ఎపిసోడ్ కు చాలా విజువల్స్ యాడ్ చేయాలనుకున్నారట. కానీ టైమ్ లేక, పేపర్ కటింగ్స్ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తూ సరిపెట్టారు.
అండ్..లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ఎంతగా హీరో నిఖిల్ కు సన్నిహితుడైనా, ఈ ఎపిసోడ్ లో నటించడానికి రానా కు ఇచ్చిన రెమ్యూనిరేషన్ 40 లక్షలు ప్లస్ జిఎస్టీ అని టాక్. టాలీవుడ్ లో తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే కదా.