స్పై సినిమా విడుదలై ఒకటి రెండు రోజులు కాకుండానే అందులో నటించిన హీరోయిన్ ఐశ్వర్య మీనన్. తమిళ, మలయాళ జనాలకు పరిచయమే. మన దగ్గర స్పై సినిమాలో అలా జస్ట్ కనిపించింది అంతే. పెద్దగా మెరుపులు మెరిపించలేదు. కానీ మాంచి జాక్ పాట్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేందుకు ఆల్ మోస్ట్ ఎంపికయినట్లే. నిన్నటికి నిన్న ఈ మేరకు ఫొటో షూట్ జరిగింది.
ఓజి సినిమా లో కాస్త ఎక్కువ కాస్టింగ్ వున్నట్లే కనిపిస్తోంది. ఈ కాస్టింగ్ కు తోడు ఇప్పుడు ఐశ్వర్య మీనన్ కు కూడా ఫొటో షూట్ చేసారు అంటే సమ్ థింగ్ స్పెషల్ క్యారెక్టర్ ఏదో ఒకటి వుండి వుండాలనే అనుకోవాలి.
తెలుగులో ఏ లెవెల్ లో అయినా హీరోయిన్ల కోరత గట్టిగానే వుంది. అందువల్ల ఇలాంటి మాంచి లీడ్ చాన్స్ దొరకడం అంటే టాలీవుడ్ లో సెటిల్ కావడానికి మాంచి ఎంట్రీ దొరికినట్లే.
దర్శకుడు సుజిత్.. నిర్మాత దానయ్య కలిసి ఓజి సినిమాను ఓ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ముంబాయిలో చాలా రోజులు షూట్ చేసిన తరువాత హైదరాబాద్ లో వర్క్ జరుగుతోంది ఈ సినిమాకు. డిసెంబర్ లో విడుదల చేస్తారు.