విశాల్ కు ఏమైంది.. హెల్త్ బులెటిన్ రిలీజ్

విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, వైరల్ ఫీవర్ కు ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడని, పూర్తి విశ్రాంతి అవసరమని ప్రకటించారు.

ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విశాల్ వణికిపోతున్న దృశ్యాలే. మైక్ పట్టుకోవడానికి కూడా శక్తి లేక అతడి చేతులు వణికిపోతున్న దృశ్యాలు, ఉబికివస్తున్న కన్నీళ్లను అతడు తుడుచుకుంటున్న విజువల్స్ చూసి అతడి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.

విశాల్ బాగుండాలంటూ తమిళనాట ఇప్పటికే పూజలు మొదలయ్యాయి. మరోవైపు చాలామంది ప్రముఖులు విశాల్ కు ఫోన్ చేసి మాట్లాడగా, మరికొందరు మీడియా ముందుకొచ్చి విశాల్ ఆరోగ్యంపై స్పందించారు.

మరోవైపు అతడి ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో, అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, వైరల్ ఫీవర్ కు ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడని, పూర్తి విశ్రాంతి అవసరమని ప్రకటించారు.

దీంతో విశాల్ పై 24 గంటలుగా వస్తున్న పుకార్లకు చెక్ పడింది. గతంలో ఓ షూటింగ్ సమయంలో విశాల్ కంటికి తీవ్ర గాయమైంది. అదిప్పుడు తిరగబెట్టిందని, మెదడు, చేయికి మధ్య సంబంధం తగ్గిపోయిందంటూ రకరకాలుగా రాసుకొచ్చారు. అవన్నీ పుకార్లని తేలిపోయింది.

4 Replies to “విశాల్ కు ఏమైంది.. హెల్త్ బులెటిన్ రిలీజ్”

Comments are closed.