‘సంక్రాంతి’ – ఫన్ విత్ ఫ్యామిలీ

సినిమా మొత్తం పడి పడి నవ్వేంత ఫన్ జనరేట్ చేసే డైలాగ్ అయితే పడలేదు. గతంలోని రావిపూడి సినిమాల్లో ఫన్ రైటింగ్ ఇక్కడ కొంచెం మిస్ అయ్యిందనే చెప్పాలి.

సంక్రాంతికి వస్తున్నాం అంటూ టాలీవుడ్ హిస్టరీలోనే తొలిసారి టైటిల్ పెట్టుకుని, అదే టైటిల్‌ను తగినట్లు సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్-ఐశ్వర్య రాజేష్-మీనాక్షి చౌదరి కాంబినేషన్-అనిల్ రావిపూడి డైరెక్షన్. దిల్ రాజు నిర్మాణం. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

ట్రైలర్ కట్ యాజ్ ఇట్ ఈజ్‌గా సినిమా స్క్రీన్‌ప్లేను ఫాలో అయిపోయినట్లు కనిపిస్తోంది. స్టెప్ బై స్టెప్ అలా లైన్‌లో కథను చెప్పేశారు. ఓ పెద్ద తలకాయను కిడ్నాప్ చేయడం, ప్రభుత్వం కలవరపడడం, సరైన వాడి కోసం వెదకడం ఒక కట్. హీరో ఇంట్రడక్షన్, భార్యతో సరసాలు, సరదాలు, వాళ్ల మధ్యకు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ రావడం, అపార్థాలు, గిల్లి కజ్జాలు, మరో సెట్. అంతా కలిసి రెస్క్యూ ఆపరేషన్‌కు బయల్దేరడం, ఆ తరువాత ఏమైంది అన్నది మిగిలిన సినిమా. కీలకంగా హీరో ఇద్దరు హీరోయిన్లు, సిఎమ్, అసిస్టెంట్.

సినిమా మొత్తం పడి పడి నవ్వేంత ఫన్ జనరేట్ చేసే డైలాగ్ అయితే పడలేదు. గతంలోని రావిపూడి సినిమాల్లో ఫన్ రైటింగ్ ఇక్కడ కొంచెం మిస్ అయ్యిందనే చెప్పాలి. అయితే గతంలో సంక్రాంతికి వచ్చిన నాగార్జున ఫన్ మూవీస్ మాదిరిగా, ఇది కూడా ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ నీట్ గా, కలర్‌ఫుల్‌గా, ఓ సరదా సినిమా ఇస్తున్నాం సంక్రాంతికి, చూడండి అని ఆహ్వానిస్తున్నట్లు ఉంది.

వెంకటేష్‌లో జోష్, స్పీడ్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఏజ్ ఫ్యాక్ట్‌నా, కంటెంట్ ఫ్యాక్ట్‌నా అన్నది చిన్న అనుమానం. మొత్తం మీద సంక్రాంతికి సరిపోవచ్చు.

5 Replies to “‘సంక్రాంతి’ – ఫన్ విత్ ఫ్యామిలీ”

  1. చిల్లర నాయాలా … నువ్ చెప్పిన ఇన్ని నెగటివ్ పాయింట్స్ లో ఒక్కటి కూడా అనిపించలేదు లేదు నాకు … సంక్రాంతికి వచ్చే 3 సినిమాల ట్రైలర్స్ లో చూడగానే నచ్చింది ఇదే

  2. One family hero – one or two colorful heroines – some comedy – some lathkor dances – brand it as family movie and release for Sankranthi.

    Public wants to watch movies during that time and generally prefer those labelled family movies. So, automatic business.

Comments are closed.