పేరు పార్వతి.. అంతకుమించి చెప్పను

గేమ్ ఛేంజర్ లో పాత్ర తనకు చాలా ప్రత్యేకమని, జాతీయ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమాలో కియరా అద్వానీతో పాటు అంజలి కూడా హీరోయిన్ గా నటించింది. రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్రకు జోడీగా ఆమె కనిపించింది. సినిమాలో ఆమె పాత్ర పేరు పార్వతి. అయితే అంతకుమించి తన పాత్ర గురించి చెప్పనంటోంది అంజలి. దానికి ఓ కారణం కూడా చెబుతోంది.

గేమ్ చేంజర్ సినిమాలో పార్వతి పాత్ర పోషించింది అంజలి. ఆ పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ చాలా ఉందంట. థియేటర్లలో ప్రేక్షకులు చూసి ఆ థ్రిల్ అనుభూతి చెందాలంటోంది. అందుకే అంతకుమించి చెప్పనంటోంది అంజలి.

నిజజీవితంలో అంజలి తల్లి పేరు కూడా పార్వతి అంట. కాబట్టి గేమ్ ఛేంజర్ లో పాత్ర తనకు చాలా ప్రత్యేకమని, జాతీయ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమాను చిరంజీవి చూశారు. అందులో అంజలి పాత్రను ప్రత్యేకంగా మెచ్చుకున్నారట. తనకింత అవార్డులు అక్కర్లేదని, చిరంజీవి ప్రశంస చాలని చెబుతోంది ఈ తెలుగు హీరోయిన్.

2 Replies to “పేరు పార్వతి.. అంతకుమించి చెప్పను”

Comments are closed.