ఫ్యాన్స్.. యాక్షన్.. ఫన్

మూడు సినిమాలు మూడు విధాలుగా ఉంటాయి. ఉండాలి. అలా ఉంటే చాలు. సంక్రాంతికి మూడు సినిమాలు అన్నది జుజుబీ.

మూడు పండగ సినిమాలు. ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? ఎలా ఉంటే టార్గెట్ రీచ్ అవుతాయి? ఇవన్నీ డిస్కషన్ పాయింట్లే.

గేమ్ ఛేంజర్ మూడ్

వేవ్ అంతా ఫ్యాన్స్, యూత్, మాస్ కంటెంట్ చుట్టూ తిరుగుతుంది. భారీ సినిమా, భారీ కథ, అంతా ఆ విధంగా రివాల్వ్ అవుతుంది. జనం థియేటర్‌లోకి వెళ్లేలా చేసేవి ఈ పాయింట్లే. వెళ్లిన తరువాత కూర్చోపెట్టేది భారీ కథ, దానికి తగిన స్క్రీన్ ప్లే, ప్లస్ యాడెడ్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఎక్కడ ఎలా కూర్చున్నాయి? జనాలను ఎలా కూర్చోపెట్టాయి అన్నదాన్ని బట్టి సినిమా సక్సెస్.

డాకూ మహరాజ్

పక్కా మాస్ మసాలా ప్యాక్డ్ సినిమా. బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి?

బలమైన హీరో పాత్ర. అంతకన్నా బలమైన విలన్ పాత్ర. వీళ్లిద్దరి మధ్య సంఘర్షణ కోసం ఓ బలమైన పాయింట్. వీటికి తోడు మరింత బలమైన ఫ్లాష్ బ్యాక్. అందులో ఇంకా బలమైన హీరో మరో షేడ్. ఇవే ప్యాకింగ్ మెటీరియల్స్. ఎంత ఆకర్షణీయంగా ప్యాక్ చేసారన్నదాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

సంక్రాంతికి వస్తున్నాం

ఈ సినిమా మిగిలిన వాటితో పోలిస్తే ఖర్చు ప్రకారం చిన్న సినిమా. కానీ బజ్‌లో మాత్రం ఏమాత్రం తీసిపోని సినిమా. సైలెంట్ సంక్రాంతి విన్నర్ ఈ సినిమా అవుతుందేమో అన్న అనుమానం కూడా. ఎందుకంటే.. పాటలు హిట్ అయ్యాయి.
ఫన్ కూడా హిట్ అయితే అంతకన్నా కావాల్సింది ఉండదు. పండగ సీజన్ కనుక మినిమమ్ వుంటే చాలు.

మొత్తం మీద మూడు సినిమాలు మూడు విధాలుగా ఉంటాయి. ఉండాలి. అలా ఉంటే చాలు. సంక్రాంతికి మూడు సినిమాలు అన్నది జుజుబీ.

7 Replies to “ఫ్యాన్స్.. యాక్షన్.. ఫన్”

Comments are closed.