ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌లు ర‌ద్దు!

ఇంట‌ర్ విద్య‌లో ఏపీ స‌ర్కార్ సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌ల్ని ర‌ద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇంట‌ర్ విద్య‌లో ఏపీ స‌ర్కార్ సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌ల్ని ర‌ద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అలాగే ఇంట‌ర్ సిల‌బ‌స్‌లో పెనుమార్పులు తీసుకురావాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యించ‌డం విశేషం. ఈ వివ‌రాల‌ను ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి కృతికా శుక్లా తెలిపారు. ప్ర‌భుత్వం తీసుకురావాల‌ని అనుకుంటున్న మార్పుల గురించి కృతికా శుక్లా వెల్ల‌డించారు.

ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌ల్ని కాలేజీలో ఇంట‌ర్న‌ల్‌గా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ప్ర‌తి స‌బ్జెక్ట్‌లో 20 మార్కులు ఇంట‌ర్న‌ల్‌గా వుంటాయి. రెండో ఏడాది ప‌రీక్ష‌ల్లో వ‌చ్చే మార్కుల్ని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లో తీసుకోనున్నారు. ఇక ఇంట‌ర్ సిల‌బ‌స్ విష‌యానికి వ‌స్తే… సీబీఎస్ఈ సిల‌బ‌స్‌ను ప్రవేశ పెట్టాల‌ని అనుకుంటున్నారు. ఈ మేర‌కు విద్యార్థులు, విద్యావంతులు, మేధావుల అభిప్రాయాల్ని తీసుకోనున్నారు.

దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించ‌డం లేద‌ని ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి తెలిపారు. మొద‌టి ఏడాదిలో ఇంగ్లీష్‌, తెలుగు సిల‌బ‌స్ మార్చ‌నున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి తెలిపారు. అలాగే ఎన్‌సీఈఆర్టీ సిల‌బ‌స్ ప్ర‌కారం.. మ్యాథ్స్‌, కెమెస్ట్రీ సిల‌బ‌స్ బాగా త‌గ్గుతుంద‌ని తెలిపారు.

8 Replies to “ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప‌రీక్ష‌లు ర‌ద్దు!”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి వర్క్

  2. పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడని పాస్ అయ్యే వాళ్ళ మీద రివెంజ్ అనుకుంటా ! పోరగాళ్ళకి సాగం టెన్షన్ పొయ్యిది పో ఇక హ్యాపీ గా సినిమాలకు వేళ్లి చొక్కాలు చింపుకొని సెలెన్సర్లు తీసి బలాదూర్లు తిరగవచ్చు .

Comments are closed.