ప‌వ‌న్‌.. ఆ ముగ్గురి తోలు ఎందుకు తీయ‌డం లేదు?

మీ ప‌క్క‌నే ఉన్న జ‌న‌సేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక డాక్ట‌ర్‌, మేధావి అయిన ద‌ళితుడి గూబ ప‌గ‌ల‌గొడితే… మీ కుల‌మ‌నే కార‌ణంతో శిక్షించ‌కుండా వ‌దిలేశావా?

ప్ర‌శ్నించ‌డానికే జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని త‌ర‌చూ చెప్పే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా సూటిగా ప్ర‌శ్నించారు. తిరుప‌తి తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌కు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి బాధ్యుత‌ల‌ని ప‌వ‌న్ చెప్ప‌డాన్ని రోజా గుర్తు చేశారు. ఆ ముగ్గురి తోలు ఎందుకు తీయ‌లేద‌ని రోజా ప్ర‌శ్నించ‌డం విశేషం.

ఎందుకంటే, వాళ్ల తోలు తీస్తా, వీళ్ల తోలు తీస్తా అని ప‌దేప‌దే ప‌వ‌న్‌క‌ల్యాణ్ హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. పిఠాపురంలో శుక్ర‌వారం మ‌రోసారి తోలు తీస్తాన‌న్నారు. అందుకే ప‌వ‌న్ మాట‌ల్ని ఆయ‌న‌కే అప్ప‌జెబుతూ, రోజా పంచ్ డైలాగ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. మీడియాతో శ‌నివారం రోజా మాట్లాడారు. ఈ మ‌ధ్య క‌డ‌ప‌కు వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… ఎవ‌రు త‌ప్పు చేసినా తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అన్నార‌ని రోజా గుర్తు చేశారు.

మ‌రి తిరుప‌తిలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో బీఆర్ నాయుడు, శ్యామ‌ల‌రావు, వెంక‌య్య‌చౌద‌రితో పాటు తిరుప‌తి ఎస్పీ త‌ప్పు చేశార‌ని మీరే చెబుతున్నారు క‌దా? వాళ్లు తోలు ఎందుకు తీయ‌డం లేదు? ఎందుకు అంతు చూడ‌డం లేద‌ని రోజా నిల‌దీశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని నేర‌స్తులు త‌ప్పించుకోవాల‌ని అనుకుంటే కుద‌ర్ద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెద్ద‌పెద్ద డైలాగ్‌లు చెప్పార‌న్నారు. బీఆర్ నాయుడు, వెంక‌య్య చౌద‌రి, సుబ్బ‌రాయుడిని శిక్షించ‌డానికి ఏ కులం చూసి భ‌య‌ప‌డి ఆగిపోతున్నావ‌ని ప్ర‌శ్నించారు.

మీ ప‌క్క‌నే ఉన్న జ‌న‌సేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక డాక్ట‌ర్‌, మేధావి అయిన ద‌ళితుడి గూబ ప‌గ‌ల‌గొడితే… మీ కుల‌మ‌నే కార‌ణంతో శిక్షించ‌కుండా వ‌దిలేశావా? అని ఆమె ప్ర‌శ్నించారు. ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌ర‌గ‌క‌పోయినా జ‌రిగింద‌ని కాషాయ వ‌స్త్రాలు ధ‌రించి తిరుప‌తిలో నానా హ‌డావిడి చేశార‌ని, ఇప్పుడేమో క్ష‌మాప‌ణ చెబితే చాల‌ని త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ని రోజా మండిప‌డ్డారు. తిరుప‌తి దుర్ఘ‌ట‌న‌లో మొద‌టి నిందితుడు సీఎం చంద్ర‌బాబే అని స్ప‌ష్టం చేశారు. తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌ను న్యాయ‌స్థానాలు సుమోటోగా స్వీక‌రించి కేసు చేప‌ట్టాల‌ని రోజా కోరారు.

19 Replies to “ప‌వ‌న్‌.. ఆ ముగ్గురి తోలు ఎందుకు తీయ‌డం లేదు?”

  1. అదెమన్న పదకం పన్ని వాళ్ళు కావలి అని అక్కడ తొక్కిసలాట జరిగెలా చెసారా? పదకం ప్రకారం చెసిన తప్పులకి మాత్రం కచ్చితంగా తాటస్తారు! రడీ గా ఉండు!

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. Our courts does not takethese public related matters as sumotto.they take political issues only as they yield image and publicity.do not expect good things from them.

Comments are closed.