ప‌వ‌న్ ఆలోచ‌న అభినంద‌నీయం!

తాను చ‌ద‌వ‌డంతో పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అధునాత‌న గ్రంథాయం ఏర్పాటు చేసి, అందులో మంచి పుస్త‌కాల్ని అందుబాటులో ఉంచాల‌నే ప‌వ‌న్ ఆలోచ‌న‌ను త‌ప్ప‌క మెచ్చుకోవాలి.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ గుడ్ వ‌ర్క్‌కు శ్రీ‌కారం చుట్టారు. తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఆధునిక సౌక‌ర్యాల‌తో గ్రంథాల‌యం ఏర్పాటు చేయ‌డానికి ప‌వ‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందుకోసం పుస్త‌కాల‌ను ఆయ‌న కొనుగోలు చేయ‌డానికి విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జ‌రుగుతున్న పుస్త‌క మ‌హోత్స‌వానికి వెళ్లారు.

రూ.10 ల‌క్ష‌లు విలువ చేసే పుస్త‌కాల‌ను ఆయ‌న కొనుగోలు చేయ‌డం విశేషం. పుస్త‌క మ‌హోత్స‌వానికి ప‌వ‌న్ వెళ్ల‌డాన్ని అధికారులు గోప్యంగా వుంచారు. కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న‌గా ప‌వ‌న్ భావించి, అక్క‌డికి వెళ్లారు. శ్రీ‌శ్రీ‌, గుంటూరు శేషేంద్ర‌శ‌ర్మ‌, సి.నారాయ‌ణ‌రెడ్డి, గ‌ద్ద‌ర్‌, శివారెడ్డి , బాల‌గంగాధ‌ర్ తిల‌క్ త‌దిత‌ర క‌వుల క‌విత్వాన్ని స‌భ‌ల్లో ప‌వ‌న్ సంద‌ర్భాన్ని అనుస‌రించి చెబుతుంటారు.

సాహిత్యం ప్ర‌తి మ‌నిషిలో ప్రేమాభిమానాల్ని, మాన‌వ‌త్వాన్ని పెంపొందిస్తుంద‌ని ప‌వ‌న్ భావ‌న‌. అందుకే ఆయ‌న త‌ర‌చూ పుస్త‌క ప‌ఠ‌నం గురించి ప్ర‌స్తావిస్తుంటారు. ప‌వ‌న్ రెండు ల‌క్ష‌ల పుస్త‌కాలు చ‌దివార‌ని గిట్ట‌ని వారు ఆయ‌న్ను వెట‌కారం చేస్తుంటారు. అయితే పుస్త‌కాలు చ‌ద‌వాల‌నే అభిలాష మంచిది. అది ఆయ‌న‌కు వుంది.

తాను చ‌ద‌వ‌డంతో పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అధునాత‌న గ్రంథాయం ఏర్పాటు చేసి, అందులో మంచి పుస్త‌కాల్ని అందుబాటులో ఉంచాల‌నే ప‌వ‌న్ ఆలోచ‌న‌ను త‌ప్ప‌క మెచ్చుకోవాలి.

11 Replies to “ప‌వ‌న్ ఆలోచ‌న అభినంద‌నీయం!”

  1. ఇక్కడి వరకు బాగానే రాసావ్. రేపు ఇదే టాపిక్ మీద అష్ట వంకర లు పెట్టి మళ్ళీ రాస్తావు. ఆ మాత్రం దానికి పొగడటం దేనికి గొప్ప ఆంధ్ర. ఆయనకు మీ పొగడ్తలు అవసరం లేదు. ఆయన పని ఆయన ను చేసుకోనివ్వు చాలు

    1. ఇప్పటికే వాడి కలం అష్ట వంకర్లు తిరిగిపోయి.. “సిద్ధం” గా ఉంది.. కక్కేయడమే ఆలస్యం..

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. అదే మా జగన్ రెడ్డి అయితే.. మాంచి పదునైన.. గొడ్డలి కొనేవాడు..

    తాడేపల్లి పాలస్ లో, యెలహంక పాలస్ లో గోడలకు తగిలించుకుని మురిసిపోతుండేవాడు..

  4. ఆ గ్రంథాలయం లో 2025 లో 100 పుస్తకాలు చదివినట్లు రిజిస్టర్ లొ ప్రూఫ్ వుంటే పవన్ స్వయంగా ఆల చేసిన వాళ్ళతో ఫోన్ వీడియో కాల్ మాట్లాడతారు అని చెప్పండి. అందరికి ఉత్సాహం గా వుంటది.

    నిజంగా 100 పుస్తకాలు చదివినా వాళ్ళకి, దానీ వలన వచ్చిన విజ్ఞానాము వలన,

    పవన్ వారికి కాల్ చేసిన, చేయకపోయినా తేడా వుండదు. కానీ మిగతా వారికి ప్రోత్సాహం గా వుంటది.

  5. 2 లక్షల విలువైన పుస్తకాల కి , 2 లక్షల పుస్తకాల కి తేడా తెలిసి కూడా pawan kalyan లాంటి ప్రజా నాయకుడి మీద ఇంకా విషం కక్కుతున్నారు అంటే….🙏🙏🙏

Comments are closed.