గత అయిదారేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆంధ్రలో కోడిపందాలు ఓ పండగ మాదిరి జరుగుతున్నాయి. ప్రతి నియోజక వర్గంలో కోడి పందాల బరులు బారులు తీరాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరేడు నెలలు దాటింది.
రాష్ట్ర పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నాం అనే మాట చెబుతూ, కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు. చేసే పరిస్థితి లేదు. అందుకే హ్యాపీగా కోడి పందాల బరులు పెట్టుకోమని అనధికారికంగా చెప్పేసినట్లుంది. ఎక్కడికక్కడ పండగ వాతావరణం అలుముకుంది. పోలీసులు వస్తారనే భయం, గొడవలు జరుగుతాయనే భయం లేదు. దాంతో జనాలు ఈసారి భయంకరంగా పరుగులు పెడుతున్నారు కోడిపందాల దగ్గరకు.
హైదరాబాద్ జనాలు అంతా భోగినాడు, సంక్రాంతి నాడు బయలుదేరి ఆంధ్రకు కేవలం కోడి పందాల కోసం కారుల్లో పరుగులు తీసారు. బడా నిర్మాతల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరక్టర్లు, చిన్న నటుల వరకు అంతా అటే దారి పట్టారు. ఓ బడా నిర్మాత సతీమణి ఆంధ్రలో కోడి పందాల్లో కనిపించడం విశేషం. సితార నాగవంశీ, షైన్ స్క్రీన్ సాహు గారపాటి ఇలా చాలా మంది ఆంధ్రకు వెళ్లారు.
లక్షల్లో పందాలు చేతులు మారుతున్నాయి. పగలంతా కోడిపందాలు, రాత్రి వేళల్లో లాడ్జ్ ల్లో, ఫార్మ్ హవుస్ లో, పేకాటలు, మందు విందులతో హుషారుగా గడపుతున్నారు తెలంగాణ జనాలంతా ఆంధ్రలో. కుర్రకారు కూడా ముగ్గురు నలుగురు కలిసి కార్లు సెట్ చేసుకుని ఛలో గోదావరి జిల్లాలు అంటూ వెళ్లిపోయారు. చూస్తుంటే ఈ ఎఫెక్ట్ వచ్చే ఏడాది మీద గట్టిగా పడేలా వుంది.
ఇప్పటి వరకు ఆంధ్ర జనాలు మాత్రమే ఆంధ్రకు వెళ్లడం అన్నది విధాయకంగా వుండేది. ఇప్పుడు చూస్తుంటే ఇకపై తెలంగాణ, ఇతర రాష్ట్రాల జనాలు కూడా ఆంధ్రకు ఈ కొడి పందాల కోసం వెళ్లేలా వున్నారు.
అందరు సరదాగా సంతోషంగా వున్నారు అంటే మీకు నచ్హదు కదా GAగారు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
nee kemo yeppudu sevalu kavali.