బాలకృష్ణ టైటిల్ తో శర్వా

శర్వానంద్ కొత్త సినిమాకు, ఇలా బాలయ్య హిట్ సినిమా టైటిల్ పెట్టేశారు.

ఆ ఒక్కటి అడక్కు, గ్యాంగ్ లీడర్, తొలిప్రేమ, దేవదాసు, మిస్సమ్మ, శ్రీమంతుడు, అందాల రాముడు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ రిపీట్ అయ్యాయి. కథకు తగ్గట్టు సింక్ అయితే పాత హిట్ సినిమా టైటిల్స్ రిపీట్ చేయడానికి మేకర్స్ ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా మరో టైటిల్ రిపీట్ అయింది. దాని పేరు నారీనారీ నడుమ మురారి.

శర్వానంద్ కొత్త సినిమాకు, ఇలా బాలయ్య హిట్ సినిమా టైటిల్ పెట్టేశారు. అంతేకాదు, ఈ టైటిల్ పోస్టర్ ను స్వయంగా బాలకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కొన్ని రోజుల కిందట రామ్ చరణ్, శర్వానంద్ తో కలిసి తన షోలో చిట్ చాట్ చేశాడు బాలయ్య. అదే వేదికపై ఈ పోస్టర్ ను ఆవిష్కరించి, సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదల చేశారు.

‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తోంది నారీ నారీ నడుమ మురారి. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కెరీర్ లో శర్వానంద్ కు ఇది 37వ చిత్రం. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కనీసం ఈ హిట్ సినిమా టైటిలైనా శర్వాకు కలిసొస్తుందేమో చూడాలి.

2 Replies to “బాలకృష్ణ టైటిల్ తో శర్వా”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా ఆరు, నాలుగు, రెండు, ఐదు, eidhu

Comments are closed.