హీరోలు మద్యం ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం కొత్త కాదు. చాలామంది హీరోలు ఆ పని చేశారు. ఈమధ్య బాలకృష్ణ కూడా తనకు ఇష్టమైన ఓ బ్రాండ్ కు తెగ ప్రచారం కల్పించారు. బాలీవుడ్ లోనైతే హీరోయిన్లు కూడా లిక్కర్ బ్రాండ్స్ కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు. ఆ కల్చర్ టాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది. తాజాగా ప్రగ్యా జైశ్వాల్ అందులో చేరిపోయింది.
ఫేడ్ అవుట్ అయిపోతున్న టైమ్ లో అఖండ సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడో మద్యం బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. పక్కన ఫుల్ బాటిల్ పెట్టుకొని, బ్లాక్ డ్రెస్ లో హొయలొలికించింది. ఆమె లిక్కర్ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం వరకు ఓకే, ఆ తర్వాత చెప్పే నీతులే నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.
మద్యం తాగమంటూ ఎంకరేజ్ చేస్తూనే.. బాధ్యతాయుతంగా తాగాలని, పాతికేళ్లు దాటిన కుర్రాళ్లకు మాత్రమే ఈ కంటెంట్ అంటూ పోస్ట్ పెట్టి చిరాకు తెప్పించింది. దీంతో ఆమెపై కాస్త గట్టిగానే ట్రోలింగ్ నడిచింది. డబ్బు సంపాదించడం కోసం ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తావా అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
హీరోయిన్లు ఇలా లిక్కర్ బ్రాండ్లు ప్రమోట్ చేయడం కొత్తేంకాదు. మొన్నటికిమొన్న పూజా హెగ్డే ఏకంగా కాక్ టైల్ కలిపి టేస్ట్ చేయమంటూ ఊరించింది. లక్ష్మీరాయ్, హన్సిక, రాధికా ఆప్టే, పాయల్ రాజ్ పుత్, ఇలియానా, కాజల్.. ఇలా చాలామంది లిక్కర్ బ్రాండ్స్ ప్రమోట్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఎన్ని మద్యం బ్రాండ్లకు ప్రచారం చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు.