అయినా..హీరో మారలేదు..తీరు మారలేదు

ఆ హీరో మంచి వాడే.. నెమ్మదైన వాడే.. పేచీలు పెట్టే రకం కాదు. కానీ ఒకటే సమస్య. బద్దకం. అచ్చం స్కూలు పిల్లాడి టైపు. మూడు రోజులు షూట్ చేస్తే, నాలుగో రోజు ఎగ్గొట్టేయాలనుకునే…

ఆ హీరో మంచి వాడే.. నెమ్మదైన వాడే.. పేచీలు పెట్టే రకం కాదు. కానీ ఒకటే సమస్య. బద్దకం. అచ్చం స్కూలు పిల్లాడి టైపు. మూడు రోజులు షూట్ చేస్తే, నాలుగో రోజు ఎగ్గొట్టేయాలనుకునే రకం. ఈ ఒక్కరోజు సెలవు ఇవ్వచ్చు కదా అన అడిగే టైపు. 

అంతే కాదు, షూటింగ్ కు వచ్చే టైమ్ లు కూడా కాస్త ఆడ్ గానే వుంటాయి. సరే, ఈ సంగతి అలా వుంచితే సరైన హిట్ లు కూడా పడడం లేదు. అలాంటి టైమ్ లో మెల్లగా ఒక ప్రాజెక్టు చేతిలోకి వచ్చింది. మరో ప్రాజెక్ట్ డిస్కషన్ లోకి వచ్చింది.

ఇండస్ట్రీలో నిర్మాతలు బోలెడు మంది వున్నారు. దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతున్నారు. మరి ఆ హీరో దగ్గరకు వెళ్లోచ్చు కదా అని అంటే ఒకటే ఆన్సర్ వినిపిస్తోంది. అమ్మో..అతనితో పడలేం. ఒకంతట షూటింగ్ జరగదు. రావడం ఆలస్యం. షూటింగ్ చేయడం ఆలస్యం. అప్పుడప్పుడు డుమ్మ కొట్టడం అనివార్యం. అందుకే అతనితో ప్రాజెక్ట్ అంటే అందరు నిర్మాతలు ధైర్యం చేయడం లేదు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా ఇలాగే ఆలస్యం అవుతోందని టాక్ వినిపిస్తోంది. ఆలస్యం కావడం వల్ల ఒక సమస్య కాదు. మిగిలిన ఆర్టిస్ట్ ల డేట్ లు, వడ్డీలు, ఇలా చాలా వుంటాయి. ఇలాంటివి అర్థం చేసుకుంటే ఆ ‘మంచి’ హీరో మరింత మంచివాడైపోవడం గ్యారంటీ.