జేడీ లక్ష్మీ నారాయణ మేధావు కాదు ఆయన తెలివైన వాడూ అంతకంటే కాదు అంటున్నారు జనసేన విశాఖ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ. ఒక టీవీ చానల్ డిబేట్ లో ఆయన ఈ సంచలన కామెంట్స్ చేశారు.
జనసేనలో మేధావులు అంతా బయటకు వచ్చారని ఆ డిబేట్ లో పాల్గొన్న రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయ్ బాబు చేసిన కామెంట్ కి రియాక్ట్ అయిన బొలిశెట్టి ఆవేశంగా జేడీ పేరు బయటకు తీసి మరీ ఆయనకు తానే టికెట్ ఇప్పించాను అని చెప్పుకున్నారు.
ఎక్కడో కడపలో పుట్టి కర్నూల్ లో చదువుకున్న జేడీకి విశాఖతో పనేంటి అని బొలిశెట్టి అంటున్నారు. జేడీ లాంటి వారికి తమ సొంత ప్రాంతానికి సేవ చేయాలని ఎందుకు అనిపించదని ప్రశ్నించారు. 2019లో తానే టికెట్ ఇప్పించాను అంటున్న బొలిశెట్టికి ఆనాడు ఈ ఆలోచన ఎందుకు తట్టలేదు అని వెంటనే ప్రశ్నలు వస్తున్నాయి. జేడీ ఐపీఎస్ చదివి ఉన్నత పదవులు నిర్వహించారు.
ఆయనకు రాజకీయ నాయకుడి కంటే కూడా మేధావిగా గుర్తింపు. అలాంటి జేడీని పట్టుకుని మేధావి కాదూ తెలివి లేదు అని బొలిశెట్టి అనడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా డిబేట్ లో లేని వ్యక్తి మీద ఈ తరహా కామెంట్స్ సబబా అని అంటున్నారు. విశాఖలో నాన్ లోకల్ జేడీ అన్న దానికీ మేధావి కారు అన్న మాటకు జేడీ రియాక్షన్ ఇస్తారా ఇస్తే ఎలా ఉంటుంది అన్నదే చూడాలి.