గుక్క‌పెట్టి ఏడ్చిన ఎంపీ

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 22 ఏళ్ల యువ‌తిని కాపాడ‌లేక‌పోయినందుకు రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మీడియా స‌మావేశంలో ఓ ఎంపీ గుక్క‌పెట్టి ఏడ్చారు. అంతేకాదు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 22 ఏళ్ల యువ‌తిని కాపాడ‌లేక‌పోయినందుకు రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని అయోధ్య ఎంపీ అవ‌దేష్ ప్ర‌సాద్ ఏడ్వ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎంపీ కన్నీళ్ల‌కు కార‌ణం ఏంటో తెలుసుకుందాం.

అయోధ్య పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన ద‌ళిత యువ‌తి గ‌త గురువారం అదృశ్య‌మైంది. దీంతో కుటుంబ స‌భ్యులు త‌ల్లిడిల్లారు. బిడ్డ ఏమైందో అనే ఆందోళ‌న‌తో ఆరా తీశారు. ఇదే సంద‌ర్భంలో శుక్ర‌వారం రాత్రి పోలీసుల‌కు కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స‌కాలంలో స్పందించ‌లేద‌నేది బాధిత కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌. బిడ్డ కోసం వెతుకుతుండ‌గా విషాద స‌మాచారం కుటుంబ స‌భ్యుల‌కు అందింది.

గ్రామానికి అర కిలోమీట‌ర్ దూరంలోని ఒక కాలువ‌లో యువ‌తి మృత‌దేహం వుంద‌ని కుటుంబ స‌భ్యులకు స‌మాచారం వెళ్లింది. కాళ్లు, చేతులు క‌ట్టేయ‌డంతో పాటు క‌ళ్లు కూడా పీకేశార‌ని బాధిత కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని అయోధ్య ఎంపీ ప్ర‌సాద్ ఆదివారం వెళ్లారు. యువ‌తిని కాపాడ‌లేక‌పోయాన‌ని, త‌న‌కీ ప‌ద‌వి ఎందుక‌ని, రాజీనామా చేస్తాన‌ని తీవ్ర ఆవేద‌న‌తో ఎంపీ ప్ర‌క‌టించారు. ఇదే సంద‌ర్భంలో స‌ద‌రు ఎంపీ వెక్కివెక్కి ఏడ్వ‌డం అంద‌ర్నీ ఆవేద‌న‌కు గురి చేసింది.

ఎంపీని ప‌క్క‌నే ఉన్న మాజీ మంత్రి నారాయ‌ణ్ పాండే ప‌వ‌న్‌, స‌మాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ప్ర‌శాంత్ యాద‌వ్ ఓదార్చారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేలా పోరాడాల‌ని ఆయ‌న‌కు న‌చ్చ చెప్పారు. యువ‌తిని కిరాత‌కంగా చంపేయ‌డాన్ని ప్ర‌ధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జ‌రిగేలా పోరాడుతాన‌ని ఎంపీ తెలిపారు.

8 Replies to “గుక్క‌పెట్టి ఏడ్చిన ఎంపీ”

    1. How do you know? Do you have any ‘divyadrushti’ or are you involved in this? Anyways, check the information before posting. He is from SP, not BJP. It’s how you congees are trying to spread wrong information and getting caught easily.

        1. Your original comment (before editing) was the local MP did it and its common for BJP to do like this. The original comment from you clearly implies that the local MP is from BJP. Otherwise, how come a local MP (from SP) collide with local BJP leaders and do this? My reply to that original comment is above. I think after my reply, you have checked and edited your comment.

          Do you have a link to the news that says it’s done by BJP leaders/cadre. As per NDTV, the case is still under investigation. They are still doing the post mortem.

          http://www.ndtv.com/india-news/ayodhya-rape-murder-awadhesh-prasad-faizabad-mp-breaks-down-after-dalit-woman-raped-killed-eyes-gouged-out-7615585/amp/1

  1. @modani media As my latest reply is not posted here, I am creating a new comment

    Your original comment (before editing) was the local MP did it and its common for BJP to do like this. The original comment from you clearly implies that the local MP is from BJP. Otherwise, how come a local MP (from SP) collide with local BJP leaders and do this? My reply to that original comment is above. I think after my reply, you have checked and edited your comment.

    Do you have a link to the news that says it’s done by BJP leaders/cadre. As per NDTV, the case is still under investigation. They are still doing the post mortem.

    http://www.ndtv.com/india-news/ayodhya-rape-murder-awadhesh-prasad-faizabad-mp-breaks-down-after-dalit-woman-raped-killed-eyes-gouged-out-7615585/amp/1

Comments are closed.