పైకి హీరోల పేర్లు చెప్పకపోయినా, సినిమా టైటిల్స్ ప్రస్తావించనప్పటికీ మనసులో ఉన్నదంతా కక్కేశారు దిల్ రాజు. ఇది చాలామంది పెద్ద హీరోలకు కోపం తెప్పించే విషయమే. ఈ విషయంలో దిల్ రాజు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇంతకీ అది ధైర్యమా.. తెగింపా..?
పెద్ద హీరోలంతా పెద్దపెద్ద వసూళ్లతో పోస్టర్లు వేయించుకుంటున్నారని బాహాటంగానే అన్నారు దిల్ రాజు. ఇక్కడితో ఆగలేదు. సినిమా బడ్జెట్లు పెరగడానికి హీరోలే కారణమని పరోక్షంగా వెల్లడించారు. హీరోలకు కూడా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తే తిక్క కుదురుతుందనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
కాంబినేషన్ల వెంటపడితే ఫ్లాపులు తప్ప, డబ్బులు రావని ప్రకటించినా.. “మాకు కొన్ని బలహీనతలుంటాయి, మీరు ఏకి పడేయండి” అంటూ మీడియాను రెచ్చగొట్టినా.. అది దిల్ రాజుకే చెల్లింది.
రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్న పెద్ద హీరోల వల్లనే ఇండస్ట్రీ నాశనం అవుతోందని, ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోందని కూడా అనేశారాయన. ఇలా చెప్పుకుంటూపోతే రీసెంట్ గా దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్స్ చాలానే ఉన్నాయి. టికెట్ రేట్లు, థియేట్రికల్ సిస్టమ్, ఓటీటీ లాంటి అంశాలపై కూడా గతంలో ఆయన ఓపెన్ గా స్పందించారు.
ఇవన్నీ చూస్తుంటే, దిల్ రాజుకు ధైర్యం ఎక్కువైనట్టుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. టాలీవుడ్ కింగ్ పిన్స్ లో దిల్ రాజు ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇండస్ట్రీని శాసించే పొజిషన్ లో ఉన్నారు.
ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో పూర్తిస్థాయి పట్టుంది కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడగలరు. దీనికి తోడు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా ఆయన స్థాయి ఇంకాస్త పెరిగింది. కాబట్టి ఆటోమేటిగ్గా ధైర్యం వస్తుందంటున్నారు కొంతమంది.
అయితే మరికొందరి వాదన మాత్రం మరోలా ఉంది. దిల్ రాజుకు పెద్ద హీరోలు అక్కర్లేదంటున్నారు వీళ్లు. నాలుగేళ్లుగా సైడ్ ట్రాక్ లో వెళ్లామని, కాంబినేషన్ల వెంట పడ్డానని, కథలు నమ్ముకొని సినిమాలు తీస్తానని, కొత్త ఏడాది నుంచి కొత్త దిల్ రాజును చూస్తారని ఆయన అంటున్న మాటలు బట్టి చూస్తుంటే.. పెద్ద హీరోలతో సంబంధం లేకుండా కంటెంట్ సినిమాలు తీయాలని ఆయన భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభాస్, మహేష్ బాబుతో దిల్ రాజుకు కమిట్ మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఆ సినిమాలు సెట్స్ పైకి రావడానికి చాలా అంటే చాలా టైమ్ పడుతుంది.
నువ్వు మరీ ఇంత బిల్డప్ ఇవ్వకు ఈ dilreddy కి. ఇతనితో సినిమాలు పెద్ద హీరోలు చెయ్యరు అని talk. మొన్న ramcharan దే last cinema. Balakrishna and chiranjeevi Anil Ravipudi సినిమాల్లో వాటా కోసం తెగ తిరిగాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలానే ఇంకొన్ని. మైత్రి movies వాళ్ళు ఇతనికి చుక్కలు చూపిస్తున్నారు.
తెలుగు సినిమా ను నాశనం చేసిందే దిల్ రాజు…హీరోలకు ఇష్టం వచ్చినంత అడ్వాన్సులు ఇచ్చుకుంటూ…వాళ్ళ ను మునగ చెట్టులు ఎక్కించడం స్టార్ట్ చేసిందే దిల్ రాజు…
పెద్ద హీరో లతో డైరెక్టర్స్ తో ప్లానింగ్ లేకుండా సినిమాలు తీసి వాటిని ప్రోపర్ గా ప్రమోట్ చేసుకోటానికి కూడా కష్టపడ్తున్నపుడు కథ బలమున్న మీడియం రేంజ్ సినిమాలు చేసుకోవటమే బెటర్ లే
ఐటీ వాళ్ళు నీ డిజిటల్ లాకర్ లో పట్టుకున్న హవాలా డబ్బు ఎక్కడిది రా హౌలే గా
ఐటీ దాడుల్లో డిజిటల్ లాకర్ లో దొరికిన హవాలా డబ్బు ఎక్కడిది రా హౌలే గా
Unna block money Monna pattukunaru.
ante help adigintaadu, hero gallu light..
money elagu poyindi..
ippudu Veedu cheyavasindi endi ante aa package hero gallaki block entha ichadu, Ela Ichado chepithe tikka kudututundi
appudu hero gallu ucha..
in a way this is his self destruction by Dil Raju.
learn from Hollywood, where producer is the royal and director is real hero and hero is reel hero.
even if you earn 20%, you gain respect in the society and wouldn’t have been this way.
greed is what took to this path