మళ్లీ సైలెంట్ అయిన పవన్ కల్యాణ్?

అదేంటో ఆది నుంచి పవన్ సినిమాల పరిస్థితి ఒక అడుగు ముందుకేస్తే, రెండడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది.

అదేంటో ఆది నుంచి పవన్ సినిమాల పరిస్థితి ఒక అడుగు ముందుకేస్తే, రెండడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది. ఇదిగో సెట్స్ పైకి వచ్చేస్తున్నాడని హడావుడి చేసేలోపే రాజకీయాలతో బిజీ అయిపోతున్నారు పవన్ కల్యాణ్. దీంతో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మింగలేక కక్కలేక కిందామీద పడుతున్నారు. ఇతర నటీనటుల కాల్షీట్లు సర్దుబాటు చేసుకోలేక, మరోవైపు వడ్డీలు కడుతూ ఇబ్బందిపడుతున్నారు.

మొన్నటికిమొన్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందనే రేంజ్ లో ప్రకటనలిచ్చారు. స్వయంగా పవన్ కల్యాణ్ “ఒక బ్లాక్ మినహా మొత్తం ఫినిష్” అంటూ ప్రకటించారు. కట్ చేస్తే, ఇంకా ఆ సినిమా షూటింగ్ చాలానే ఉందనేది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.

అటుఇటుగా 7-8 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందట. ఆ వారం రోజులు కాల్షీట్ ఇవ్వడానికి పవన్ దగ్గర టైమ్ లేదు. మరోవైపు పాటలతో ప్రచారం మొదలుపెట్టారు. పవన్ వైపు నుంచి షూటింగ్ పూర్తయితే ఓకే, లేకపోతే ప్రచారాన్ని ఆపేసి, కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు.

అటు ఓజీ పరిస్థితి కూడా అలానే ఉంది. పవన్ కల్యాణ్ సూచన మేరకు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలన్నీ పూర్తిచేసి రెడీగా ఉన్నారు. ఇక పవన్ రావడమే ఆలస్యం. సంక్రాంతి తర్వాత పవన్ సెట్స్ పైకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇంకా రాలేదు.

పైన చెప్పుకున్న రెండు సినిమాలకు అటుఇటుగా 3 వారాలు టైమ్ కేటాయిస్తే.. టోటల్ షూటింగ్స్ పూర్తయిపోతాయి. కానీ ఆ టైమ్ కేటాయించలేని పరిస్థితిలో పవన్ ఉన్నారు. ఫిబ్రవరి మొదలైంది. కనీసం ఈ నెల్లోనైనా పవన్ కాల్షీట్లు ఇస్తారేమోనని నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మిగిలిన మూడో సినిమా గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడుకోవడం కూడా అనవసరం.

7 Replies to “మళ్లీ సైలెంట్ అయిన పవన్ కల్యాణ్?”

  1. Era pawan kalyan?,

    Tirupathi lo ycp corporators kidnap anta ??

    ippudu rara open keep, varaahi, naa bongu ani,

    janam nee kutha lo ganji pista Ari..

    chachi oorukuntaav kodaka

  2. Manchi asale kanipinchani melanti vallani em analo theliyatledhu..money undhi blog undhi ani matladutharu thidithe pattinchukoru..villages lo unte thelusthundhi meku

Comments are closed.