ఆ జిల్లాకు ఆయనే దొర…?

అవును ఆయన వంటి పేరులోనే దొర ఉంది. ఆయ‌న అసలు పేరులో రాజున్నాడు. ఆయనే పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.  Advertisement…

అవును ఆయన వంటి పేరులోనే దొర ఉంది. ఆయ‌న అసలు పేరులో రాజున్నాడు. ఆయనే పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 

ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఆయన వైఎస్సార్ భక్తుడు. ఆయన ప్రోత్సాహంతో ఫస్ట్ టైమ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గిన రాజన్న దొర గిరిజనులకు అభిమానం పాత్రుడు. ఎటువంటి భేషజం లేకుండా ప్రజలతో కలసిపోయే నైజం ఆయన సొంతం.

అలాంటి రాజన్న దొరకు ఇన్నాళ్ళు మంత్రి అయ్యే అవకాశం లభిస్తోందని టాక్. ఉమ్మడి విజయన‌గరం జిల్లాకు ఆయనే రాజు కాబోతున్నాడు అని అంటున్నారు. ఇంతకాలం సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఏకచత్రాధిపత్యం వహించారు.

ఇపుడు ఆ ప్లేస్ లోకి రాజన్నదొర రానున్నారు. పైగా ఆయనకు ఎస్టీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి మా రాజన్న మంత్రి అవుతున్నాడు అని ఆయన అనుచరులు అపుడే సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక రాజన్నదొరకు మంత్రి పదవి ఇవ్వడం నిజంగా సముచితమైన వ్యవహారం అని అంటున్నారు. విధేయతకు, నిజాయతీకి పట్టం కట్టడమే అని అంతా భావిస్తున్నారు. మొత్తానికి చివరి నిముషంలో ఏమైనా మారకపోతే మాత్ర 11న మంత్రిగా ప్రమాణం చేసేది రాజన్నదొరే అని అంటున్నారు.