పుష్ప డేట్…పాజిబుల్..?

ఆగస్టు 15న విడుదల అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ డేట్ కాస్త సంచలనమే కలిగించింది. నిజానికి ఎవరి సినిమా డేట్ ప్రకటించినా ఆశ్చర్యం కలుగదు కానీ సుకుమార్ సినిమాకు డెడ్ లైన్,…

ఆగస్టు 15న విడుదల అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ డేట్ కాస్త సంచలనమే కలిగించింది. నిజానికి ఎవరి సినిమా డేట్ ప్రకటించినా ఆశ్చర్యం కలుగదు కానీ సుకుమార్ సినిమాకు డెడ్ లైన్, డేట్ అంటేనే అనుమానం వస్తుంది.

ఎందుకంటే ఆయన సిన్మాను శిల్పంలా,సుతారంగా, సున్నితంగా చెక్కుకుంటూ పోతారు. ఆ చెక్కడంలో టైమ్ అన్నది పట్టించుకోరు. క్వాలిటీ అవుట్ పుట్ కావాలంటే సుకుమార్ ను తొందర పెట్టకూడదు. ఇలాంటి విషయాలు చాలా వినిపిస్తుంటాయి టాలీవుడ్ లో.

ఇలాంటి నేపథ్యంలో పుష్ప డేట్ ప్రకటించారు. సరే ఆరు నెలలు టైమ్ వుంది కదా..సరిపోతుందని చాలా మంది అనుకున్నారు. అనుకుంటున్నారు. కొరటాల శివ సినిమా వుంది. మళ్లీ లేట్ అయితే కొరటాల శివ వేరే సినిమా మీదకు వెళ్తారేమో?అందుకే డేట్ ప్రకటించారు అనే టాక్ కూడా వుంది.

ఇవన్నీ ఇలా వుంచితే అసలు సుకుమార్ ప్రమేయం లేకుండా డేట్ ప్రకటించేసారు. దానికి ఆయన కాస్త ఫీలవుతున్నారనే గ్యాసిప్ కూడా వుంది. వీటన్నింటికీ అతీతంగా ఇంకో విషయం కూడా వినిపిస్తోంది. 

పుష్ప సినిమాకు ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ సంగతి పక్కన పెడితే జరగాల్సిన షూటింగ్ డేస్ మరో 120 నుంచి 150 రోజుల వరకు వున్నాయని అంటున్నారు. అన్ని రోజులు షూటింగ్ నా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అది వేరే సంగతి.

ఇదిలా వుంటే అసలు పుష్ప ఆ డేట్ కు రావడం ఇంపాజిబుల్ అని ఎందుకయినా మంచిది తమ సినిమాను ఆ డేట్ కు రెడీ చేసి పెట్టుకుంటే కలిసి వస్తుందని ఆలోచనలు కూడా సాగుతున్నాయి. పూరి సినిమాకు, అయ్యప్పన్ రీమేక్ కు, రాథేశ్వామ్ కు డేట్ లు కావాలి. ఇప్పుడు అవన్నీ పుష్ప రిలీజ్ పాజిబులిటీస్ గురించి ఆరా తీస్తున్నాయి. 

ఆ మాటకు వస్తే ఇప్పటికే డేట్ లు ప్రకటించిన చాలా అంటే చాలా సినిమాలు ఆయా డేట్ లకు రాకపోవచ్చనే టాక్ కూడా వుంది. వారం వారం సినిమాలు ప్రకటించారు కానీ దగ్గరకు వచ్చిన తరువాత ప్రాక్టికల్ ప్రోబ్లమ్స్ అర్థం అవుతాయి. అప్పుడు వెనకడుగు వేస్తాయి అన్న మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?