ఎక్స్ క్లూజివ్.. వీరమల్లుగా మారిన విరూపాక్ష

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్టు మూవీ ఓపెనింగ్ నుంచి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ టైటిల్ స్థానంలో మరో కొత్త పేరు వచ్చి చేరింది. అదే…

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్టు మూవీ ఓపెనింగ్ నుంచి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ టైటిల్ స్థానంలో మరో కొత్త పేరు వచ్చి చేరింది. అదే వీరమల్లు.

క్రిష్ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడనే సంగతి తెలిసిందే. సినిమాలో ఈ పాత్ర పేరు వీరమల్లు. అందుకే సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట మేకర్స్. పవర్ ఫుల్ గా ఉండడం కోసం హరహర వీరమల్లు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

అయితే ఇది కూడా వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఫైనల్ చేసిన 3 టైటిల్స్ లో ఒకటి మాత్రమే. పవన్ కల్యాణ్ నుంచి ఈ టైటిల్ కు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. కాబట్టి ఇదే పక్కా అని చెప్పడానికి వీల్లేదు.

ఈ సినిమాకు సంబంధించింది ఇప్పటికే 3 షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వర్క్ నడుస్తోంది. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ కాల్షీట్లు కేటాయించబోతున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..