నిమ్మగడ్డ నటనా చాతుర్యం

ఎస్ఈసీ నిమ్మగడ్డలో మంచి నటుడు దాగి ఉన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆ నటుడు ఇలా బైటకొచ్చి అలా లోపలికి వెళ్లిపోతుంటారు. కడప గడ్డపై వైఎస్ఆర్ నామాన్ని స్మరించే విషయంలో నిమ్మగడ్డలోని నటుడు బయటపడ్డారు. ఇప్పుడు…

ఎస్ఈసీ నిమ్మగడ్డలో మంచి నటుడు దాగి ఉన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ఆ నటుడు ఇలా బైటకొచ్చి అలా లోపలికి వెళ్లిపోతుంటారు. కడప గడ్డపై వైఎస్ఆర్ నామాన్ని స్మరించే విషయంలో నిమ్మగడ్డలోని నటుడు బయటపడ్డారు. ఇప్పుడు పంచాయతీ మేనిఫెస్టో విషయమై టీడీపీని వివరణ కోరే విషయంలో కూడా ఆయనలోని నటనా చాతుర్యం బయటపడింది. 

చీటికీ మాటికీ వైసీపీ నేతలు పల్లెత్తు మాట మాట్లాడినా రంకెలు వేస్తూ, ఏకంగా గవర్నర్ నే డిఫెన్స్ లో పడేసేలా లెటర్లు రాస్తూ, చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసే నిమ్మగడ్డ, టీడీపీ విషయంలో మాత్రం భలే వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

పంచాయతీ ఎన్నికల కోసం పంచ సూత్రాలతో చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసి నాలుగు రోజులవుతోంది. ఇప్పటి వరకూ ఆ సంగతి అసలు ఎన్నికల కమిషనర్ కే తెలియకపోవడం విచిత్రం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకగ్రీవ నజరానాల ప్రకటన మాత్రం అయ్యగారికి బహుబాగా కనపడింది, గంటల వ్యవధిరోనే సమాచార శాఖ కమిషనర్ కు నోటీసు వెళ్లిపోయింది. 

అవే పత్రికలు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని కూడా ప్రకటించాయి కదా, ఈనాడు మరీ విడ్డూరంగా పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు, జగన్ కంటే ఎక్కువ డబ్బులిస్తారంటూ పోలిక పెట్టి మరీ మేనిఫెస్టోని హైలెట్ చేసింది. ఇన్ని జరిగినా ఈ వ్యవహారం ఎస్ఈసీ దృష్టికి వెళ్లకపోవడం విడ్డూరమే.

చివరకు వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఆయన అలర్ట్ అయ్యారట. మేనిఫెస్టోపై వివరణ ఇవ్వండి అంటూ టీడీపీకి పంపించిన నోటీసులో కూడా వైసీపీ పేరు ప్రస్తావించడం గమనార్హం. టీడీపీ మేనిఫెస్టోపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో టీడీపీ వివరణ కోరుతూ ఈసీ రాసిన లేఖలో వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఒక అభిప్రాయానికి వచ్చేందుకు వివరణ ఇవ్వాల్సిందిగా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఎంత చాకచక్యంగా ఈ లెటర్ రెడీ చేశారో అర్థమవుతుంది.

బాబు కాదు, ఎవరో బకరా వివరణ ఇవ్వాలి

టీడీపీ మేనిఫెస్టోని విడుదల చేసింది, చేతిలో పట్టుకుని మీడియాకి ఫోజులిచ్చింది, రెచ్చిపోయి అందులోని అంశాలను ఏకరువు పెట్టింది చంద్రబాబు. మేనిఫెస్టోలో బాబు, చినబాబు ఇద్దరి ఫొటోలు ఉన్నాయి. పైగా ఆ జాతి పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కాస్త ఆలోచన ఉన్న ఎవరైనా చంద్రబాబు వివరణ కోరతారు.

కానీ విచిత్రంగా నిమ్మగడ్డ టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుని వివరణ ఇవ్వాల్సిందిగా లేఖ రాశారు. మేనిఫెస్టోలో ప్రచురణకర్తగా ఆయన పేరు ఉండటంతో లేఖ ఆయనకే పంపించామని కబుర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 2లోగా వివరణ కోరినట్టు లేఖలో పేర్కొన్నారు. ఇంత డ్రామా నడుపుతున్న నిమ్మగడ్డ రేంజ్ కి ఆస్కార్ కూడా తక్కువేననిపించడం అతిశయోక్తి కాదు. 

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..