చిరుతో పోటీకి బాలయ్య సై ?

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా డేట్ వచ్చేసింది. మే 13న విడుదలకు ముహుర్తం నిర్ణయించేసారు.  Advertisement అలాగే ఆ మర్నాడే వెంకీ 'నారప్ప' సినిమా కూడా రాబోతోంది. మరి ఇంతకీ బాలయ్య-బోయపాటిల…

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా డేట్ వచ్చేసింది. మే 13న విడుదలకు ముహుర్తం నిర్ణయించేసారు. 

అలాగే ఆ మర్నాడే వెంకీ 'నారప్ప' సినిమా కూడా రాబోతోంది. మరి ఇంతకీ బాలయ్య-బోయపాటిల సినిమా ఎప్పుడు? అదే ఇంట్రస్టింగ్ టాపిక్ ఇప్పుడు.

టాలీవుడ్ లో వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే ఆ సినిమాను కూడా మే లోనే విడుదల చేసే ఆలోచనలో వున్నారని. అంతే కాదు, ఆచార్య సినిమాకు కాస్త అటు ఇటుగానే విడుదల వుంటుందని. 

చిరుకు బాలయ్యకు అంతగా పొసగదు అన్న సంగతి బహిరంగ రహస్యం. అలాగే బోయపాటికి కోరటాలకు మధ్య కాస్త ఇగో సమస్యలు వున్నాయన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది.

వీటన్నింటి రీత్యా తమ సినిమాను నేరుగా ఆచార్య సినిమాకు పోటీగా రంగంలోకి దింపాలని బోయపాటి-బాలయ్య ప్లాన్ చేస్తున్నారన్నది టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ల సారాశం. 

నిజానికి ఇలా చేయడం కూడా మంచిదే కావచ్చు. అప్పుడే ఇటు అటు కూడా ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వస్తుంది. సినిమాలకు మాంచి బజ్ వస్తుంది. సత్తా వున్న సినిమా సక్సెస్ అవుతుంది.

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..