వచ్చీరావడంతోనే హిట్ కొట్టింది. ఇక తిరుగులేదు అనిపించుకుంది. కానీ సినిమాల ఎంపిక విషయంలో చేసిన తప్పులతో ఇప్పుడు ఇంటికెళ్లే పొజిషన్ లో ఉంది. దీంతో ఉన్న ఈ కొద్ది టైమ్ లోనే మొత్తం సర్దేసుకుందాం అనేలా తయారైంది ఆ హీరోయిన్.
సినిమా ఆఫర్ల నుంచి షాప్ ఓపెనింగ్స్, ఫొటో షూట్స్ వరకు అందినకాడికి చేసేద్దాం అని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో తన రేటును అమాంతం తగ్గించేసింది ఈ హీరోయిన్.
ఒకప్పుడు ఆమె షాప్ ఓపెనింగ్ కు వస్తే 15 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 4 లక్షలిస్తే చాలు ఎక్కడికైనా వస్తానంటోంది. ఫొటోషూట్స్ కోసం సవాలక్ష కండిషన్లు పెట్టేది. కానీ ఇప్పుడు లక్ష రూపాయలకే ఫొటో షూట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఆదాయ మార్గాలివే. సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి మరి.
ఇప్పుడామె తన రెమ్యూనరేషన్ ను పూర్తిగా తగ్గించేసింది. కానీ ఆమెను సినిమాల్లోకి తీసుకునేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. సదరు హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ను వేసుకొని సెట్స్ కు వస్తోంది. సింగిల్ గా ఉన్న హీరోయిన్లకే డిమాండ్. ఇలా వెంట బాయ్ ఫ్రెండ్ ను పెట్టుకుంటే ఎవరైనా ఎందుకు అవకాశాలిస్తారు?
అందుకే ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికితోడు కరోనా తర్వాత ఆమె జోరు మరింత తగ్గింది. ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమాతో నెట్టుకొస్తోంది. అది కూడా షూటింగ్ చివరి దశకు చేరడంతో కన్నడ, తమిళ సినిమాల వైపు తొంగి చూస్తోంది. కనీసం అక్కడికైనా బాయ్ ఫ్రెండ్ లేకుండా సింగిల్ గా వెళ్తే ప్రయోజనం ఉంటుందని ఆమెకు సూచిస్తున్నారు సన్నిహితులు.