నచ్చిన మనుషులతో కలిసి పని చేయడానికి మించిన ఆనందం మరొకటి లేదు. ఇక సినిమా రంగంలో నచ్చిన హీరోతో నటించే అవకాశం వస్తే… కెవ్వుమని కేక వేయకుండా ఎలా వుంటారు. స్టార్ హీరోయిన్ రష్మిత మందన్నా తాజాగా అలాంటి ఆనంద పారవశ్యానికి లోనయ్యారు. తనకెంతో ఇష్టమైన హీరోతో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంలో చిందులు వేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
తమిళస్టార్ దళపతి విజయ్ అంటే రష్మికకు ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి నటించాలనే ఆమె కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. ఈ అవకాశానికి ఆమె ఉప్పొంగిపోతున్నారు. విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనుంది. తమిళ స్టార్ హీరో విజయ్ తొలిసారిగా నటిస్తున్న తెలుగు చిత్రం కావడం విశేషం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్స్‌పై ‘దిల్’రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం చెన్నైలో అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో రష్మిక ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని ప్రకటించారు. విజయ్ అంటే తనకెంతో ఇష్టమని, ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలంటూ అనేక సందర్భాల్లో రష్మిక ప్రకటించిన నేపథ్యంలో ఈ ట్వీట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
‘ఎప్పటి నుంచో సార్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నా. ఇలా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకేదో అనిపిస్తుంది. ఇక సార్‌తో డ్యాన్స్ చేస్తా, మాట్లాడ్తా, అన్ని చేస్తా..చాలా ఆనందంగా ఉంది’ అంటూ రష్మిక ట్వీట్ భావోద్వేగ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.